English   

విజయశాంతి సినిమాలు కంటిన్యూ చేస్తుందా..

vijay
2020-01-06 19:10:21

13 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది విజయశాంతి. అయితే ఈ సినిమా కథ నచ్చడంతో నటిస్తుందా లేదంటే ఇకపై కూడా వరసగా సినిమాలు చేస్తుందా అనే అనుమానం మాత్రం అభిమానుల్లో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు దీనికి సమాధానం విజయశాంతి నుంచి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా నటనకు దూరంగా ఉన్న తనకు అనిల్ రావిపూడి చెప్పిన కథ కాస్త బెటర్ గా అనిపించిందని.. రీ ఎంట్రీకి బాగుంటుందని ఆలోచించి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు విజయశాంతి. ఇందులో ఆమెది నెగెటివ్ పాత్ర అని అడిగితే విజయశాంతి ఎప్పుడు నెగిటివ్ రోల్స్ చేయదు.. నేను పాజిటివ్ పర్సన్ అలాంటి పాత్రలు మాత్రమే చేస్తాను అంటోంది ఈ సీనియర్ హీరోయిన్. ఇకపై అమ్మ వదిన పాత్రలు చేస్తారా అంటే అసలు సమస్యే లేదు..

విజయశాంతిని అభిమానులు అలా చూడలేరు అంటూ సమాధానం చెప్పింది ఈమె. మదర్ ఇండియా లాంటి స్క్రిప్ట్ వస్తే తల్లి పాత్ర చేయడానికి తనకేం అభ్యంతరాలు లేవని.. అలా కాకుండా సింపుల్ రోల్స్ తన వల్ల కాదు అంటుంది విజయశాంతి. విభిన్నమైన పాత్రలు వచ్చినప్పుడు కచ్చితంగా ఇకపై సినిమాల్లో నటిస్తానని క్లారిటీ ఇచ్చింది ఈ లేడీ సూపర్ స్టార్. ఎలాగు ఎన్నికలు అయిపోయాయి. రాబోయే ఐదేళ్ల వరకు విజయశాంతి చేసేది కూడా ఏమీ ఉండదు. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించే పనిలో బిజీగా ఉన్నారు. ఏదేమైనా ఇకపై లేడీ సూపర్ స్టార్ సినిమాల్లో బిజీ కావడానికి ప్రయత్నిస్తుంది.

More Related Stories