English   

సంక్రాంతికి ఎవరి పరిస్థితి ఏంటి.. బరిలో పందెంకోళ్లు..

sankratri
2020-01-06 19:56:11

సంక్రాంతి సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు.. వ‌ర‌స‌గా సినిమాలు వ‌చ్చేస్తుంటాయి. ఈ సారి కూడా ఇదే జ‌రుగుతుంది. 2019 సంక్రాంతికి నాలుగు సినిమాలు వ‌చ్చాయి. అందులో ఎఫ్ 2 సినిమా మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఆ సినిమాతో పాటు వ‌చ్చిన విన‌య విధేయ రామ‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, పేట సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒకేసారి ఇన్నిసినిమాలు రావ‌డం కూడా దీనికి శాపంగా మారిపోయింది. ఇక ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. 2020 సంక్రాంతికి కూడా 4 సినిమాలు రానున్నాయి. అందులో అంతా స్టార్ హీరోలే ఉండ‌టం విశేషం. మ‌హేష్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు కూడా సంక్రాంతి పండ‌క్కే రానుంది. ఈ సినిమాను జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేస్తున్నాడు దిల్ రాజు. ఆయ‌న‌కు ఆ తేదీ కూడా బాగానే క‌లిసొచ్చింది. ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగానే జరిగింది. ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆయనకు పోటీగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కూడా తన అల వైకుంఠపురములో సినిమాను పండ‌క్కి..

పైగా మహేష్ వచ్చిన ఒక్కరోజు తర్వాత జనవరి 12నే విడుద‌ల చేస్తున్నాడు. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ కూడా ఘనంగా జరగనుంది. సౌత్ ఇండియాలోనే ఇప్పటి వరకు లేనట్లు చాలా గ్రాండ్ గా మ్యూజికల్ నైట్ చేస్తున్నాడు తమన్. మహేష్ బాబు, అల్లు అర్జున్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా జనవరి 15న విడుదల కానుంది. ఈ సినిమా పోస్టర్స్ కూడా ఇప్పుడు విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ మూడు సినిమాలతో పాటు రజినీకాంత్ దర్బార్ కూడా సంక్రాంతికే విడుదల కానుంది. అందరికంటే ముందు సంక్రాంతి పోరును మొదలు పెడుతున్నది రజినీనే. ఈయన జనవరి 9న దర్బార్ సినిమాతో వస్తున్నాడు. ఒకేసారి 4 పెద్ద సినిమాలు వ‌స్తే క‌చ్చితంగా అది క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని తెలిసినా కూడా ఎవ‌రికి ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. ఈ సారి అన్ని సినిమాలపై కూడా ఆసక్తి బాగానే ఉంది.. అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కచ్చితంగా ఎవరికి వాళ్లు సత్తా చూపిస్తారనే నమ్ముతున్నారు అభిమానులు. 2017లో శతమానం భవతి, ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి.. అన్నీ బాగానే ఆడాయి. ఈ సారి కూడా ఇలాంటిదే జరగాలని కోరుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అదే జరిగితే ఇండస్ట్రీకి అంతకంటే కావాల్సింది మరోటి అయితే లేదు. ఏదేమైనా కూడా ఈ సంక్రాంతికి దాదాపు 350 కోట్ల బిజినెస్ అయితే జరుగుతుంది.

More Related Stories