English   

మరో సినిమా మొదలెట్టిన సంపూ

samp
2020-01-06 20:16:04

హృదయకాలేయం లాంటి విచిత్రమైన సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు హీరో సంపూర్ణేష్ బాబు.. మొదటి సినిమాతో అందరిని ఆకట్టుకున్న సంపూని అందరు బ‌ర్నింగ్ స్టార్ అనే బిరుదు సైతం సంపాదించాడు. ఈ సినిమా తర్వాత సంపూ చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి.. ఇక గత ఏడాది చేసిన కొబ్బరిమట్ట సంపూని మళ్లీ బానే ఆడింది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మరో సినిమాని మొదలు పెట్టాడు సంపూ. ఎన్‌.హరిబాబు ద‌ర్శక‌త్వంలో ఆయన చేస్తున్న సినిమా షూటింగ్ సంతనూతలపాడులోని కృష్ణసాయి గ్రానైట్‌ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ప్రారంభం అయింది. ఈ సినిమాలో సంపూ సరనస కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుందట. పృథ్వీ , షియాజీ షిండే, కత్తి మహేష్‌, తనికెళ్ల భరణి, సుధతో పాటు పలువురు నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సీనియర్ రచయిత మరుదూరి రాజా మాటలు అందిస్తుండడం గమనార్హం. 

More Related Stories