English   

బికినీలో సెగలు పుట్టిస్తున్న సారా అలీ ఖాన్

sara
2020-01-06 20:35:48

టాలీవుడ్ లో హీరోల వారసులు అంటే కేవలం కొడుకులు మాత్రమే ఇండస్ట్రీలోకి వస్తుంటారు. కానీ, బాలీవుడ్ లో మాత్రం అలా కాదు. టాప్ హీరోల కూతుర్లు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంటారు. ఇలా వచ్చిన వాళ్లలో సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా  అలియా భట్ లాంటి వారు ఎందరో ఉన్నారు. ఇక త్వరలోనే షారుక్ ఖాన్ కూతురు కూడా హాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నది. అటు మరో టాప్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కూడా కేధరినాథ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఆ కేధరినాథ్ సినిమా అంతంత మాత్రమంగానే ఆడింది. ఆ అనతరం రణ్‌బీర్ సింగ్‌తో జోడిగా వచ్చిన సింబాతో సూపర్ హిట్ కొట్టింది. ఇక తన ఖాళీ సమయాల్లో సారా అలీఖాన్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ, బికినీ డ్రెస్ లలో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నది. తాజా గా సారా స్విమ్మింగ్ పూల్ పక్కన స్విమ్ డ్రెస్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది.  ఆ ఫోటో చూసి ఫ్యాన్స్ అందరూ తెగ మురిసిపోతున్నారు. బికినీలో హాట్ హాట్‌గా సారా అలీఖాన్ పెట్టిన ఫోటోలు యూత్ లో సెగలు పుట్టిస్తున్నాయి. మరి మీరు కూడా చూసెయ్యండి.

More Related Stories