English   

మరోసారి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన బన్నీ..

aapk
2020-01-07 05:17:07

పవన్ కల్యాణ్, బన్నీ మధ్య ఏదో కోల్డ్ వార్ అయితే కచ్చితంగా నడుస్తుంది. అది కాదని చెప్పినా కూడా కచ్చితంగా అవుననే అంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు. గతంలోనే ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. ఇప్పుడు కూడా మరోసారి ఇదే జరిగింది. తాజాగా అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో బన్నీ మాట్లాడిన తీరు చూసి అంతా షాక్ అయ్యారు. అంతా బాగానే ఉంది.. అన్నీ బాగానే చెప్పాడు కానీ చివర్లో మాత్రం తనకెవరూ ఉన్నా లేకపోయినా అనే పదం వాడేసాడు. ఈ వేడుకకు మెగా కుటుంబం నుంచి ఎవరూ రాలేదు. తన సొంత అన్నాదమ్ములే ముఖ్య అతిథులుగా వచ్చారు. బాబీ, శిరీష్ తో కలిసి వచ్చాడు బన్నీ. ఇక అల్లు అరవింద్ నిర్మాత హోదాలో వచ్చాడు. అప్పటి వరకు అందరికీ మనస్పూర్థిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చిన అల్లు వారబ్బాయి చివరికి వచ్చేసరికి మరీ ఎమోషనల్ అయిపోయాడు. తండ్రి గురించి మాట్లాడుతూ.. తన తండ్రి లాంటి తండ్రి ఇంకెవరికి ఉండడని చెప్పేసాడు. ఇదిలా ఉంటే అంతా కింది నుంచి పవన్ కల్యాణ్ అంటూ అరుస్తుంటే దానికి బన్నీ మాత్రం మరోసారి చెప్పను బ్రదర్ రేంజ్ లో సమాధానం చెప్పేసాడు.

తనకు చిరంజీవి అంటే ప్రాణం అని.. ఆయన తర్వాతే ఎవరైనా అంటూ మరోసారి కుండ బద్ధలు కొట్టేసాడు. చిరంజీవి ఒక్కడే తన ప్రాణం అని మళ్లీ మళ్లీ నొక్కి చెప్పాడు బన్నీ. కొందరు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడమంటున్నారు.. మీరు చెప్తున్నారు కాబట్టి పవర్ స్టార్ గురించి మాట్లాడుతున్నానంటూ మరోసారి మంట పెట్టేసాడు బన్నీ. తనకు ఎవరున్నా లేకపోయినా అభిమానులున్నారు అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసాడు బన్నీ. అందరికీ అభిమానులుంటే తనకు ఆర్మీ ఉందని.. నా ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అంటూ మళ్లీ మళ్లీ చెప్పాడు బన్నీ. మెగా అభిమానులు అని ఇంతకుముందు చెప్పే బన్నీ.. ఇప్పుడు మాత్రం నా ఫ్యాన్స్ అంటున్నాడు. ఈ మాటతీరులోనే మార్పు కనిపించింది కూడా. రెండేళ్లు సినిమాలు చేయకపోయినా కూడా మీరంత నా వెంటే ఉన్నారంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు బన్నీ. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడకపోవడం మాత్రమే అభిమానులకు కోపం తెప్పించింది.. దాంతో సోషల్ మీడియాలో ఈయనపై బాగానే ట్రోలింగ్స్ నడుస్తున్నాయిప్పుడు. కావాలనే పవన్ కల్యాణ్ ను బన్నీ దూరం పెడుతున్నాడంటూ రచ్చ చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే.. మెగా హీరోలందరం ఒక్కటే అని పైకి చెప్పుకుంటున్నా కూడా లోపల మాత్రం చాలా తేడాలున్నాయని ఇప్పుడు బన్నీ మాటలు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఈ వేడుక తర్వాత మరోసారి బన్నీ, పవన్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధం జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.

More Related Stories