English   

మోహన్ బాబు పొలిటికల్ గేమ్ ప్లాన్ అదేనా 

mohan babu
2020-01-07 10:16:22

మోహన్ బాబు పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన బీజేపీని ఎంచుకునే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసిన మోహన్ బాబు నిన్న కుటుంబ సమేతంగా ఢిల్లీలో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది.ఆయన కుటుంబంతో సహా ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలను కలిశారు. 

కొద్దికాలంగా టీడీపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న మోహన్ బాబు త్వరలోనే రాజకీయ ప్రవేశం చేస్తానని చెప్పుకున్నారు. ఆయన వైసీపీలో కూడా చేరారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధుల తరఫున మోహన్ బాబు, ఆయన కొడుకు హీరో విష్ణు ప్రచారం చేశారు. విష్ణు భార్య విరోనికాకు జగన్ కు బంధుత్వం ఉంది. ఆ కోవలో మంచు ఫ్యామిలీ వైసీపీలోనే ఉంటుందని అంతా భావించారు. కట్ చేస్తే మోహన్ బాబు ఫ్యామిలీతో సహా ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. నేరుగా మోడీని కలిశారు. బీజేపీలో చేరాలన్న ఉద్దేశంతో ఉన్న మోహన్ బాబు ఆ సమాచారాన్ని ఆ పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర నేతలు ఏర్పాటు చేసిన అపాయింట్ మెంట్ తోనే మోహన్ బాబు మోడీని కలిశారని అంటున్నారు. 

అయితే తాజాగాఈ భేటీ వెనుక ఉన్న మరో రాజకీయ కోణం తెరపైకి వచ్చింది. ఏపీ రాజధాని విషయంలోనే మోహన్ బాబు మోదీతో సమావేశమయ్యారని అంటున్నారు. చిరు సలహాతోనే మోహన్ బాబు మోదీని కలిశారని కూడా సమాచారం. జగన్ దూతగానే మోదీ వెళ్లి విశాఖ రాజధానిగా మారడం తెలుగు సినీ పరిశ్రమకు అంగీకారమేనని నన్న సమాచారం మోదీకి తెలిపేందుకు మంచు మోహన్ బాబు ప్రధాని దగ్గరకు వెళ్లారని ప్రచారం అవుతోంది. 

ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి కూడా జగన్ కే సపోర్ట్ చేస్తున్నారు. అదీ కాక అప్పట్లో చిరు ఫ్యామిలీ వైజాగ్ లో స్టూడియో కడతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ రాజధాని మారి అక్కడికి వెళ్లి స్టూడియో కడితే దానికి విలువ ఉంటుందని అందుకే మోహన్ బాబుతో మోడీ వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పి రమ్మని పంపారని టాక్ వినిపిస్తోంది. 

More Related Stories