English   

వెక్కివెక్కి ఏడ్చిన బన్నీ.. ఓదార్చిన తండ్రి.. 

Allu Arjun
2020-01-07 10:34:54

ఎందుకో తెలియదు కానీ చాలా ఎమోషనల్ అయిపోయాడు అల్లు అర్జున్. ఎప్పుడూ సరదాగా ఉండే బన్నీ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయేసరికి అక్కడున్న వాళ్లు కూడా అంతా షాక్ అయ్యారు. అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ వేడుకలో చాలా విషయాల గురించి మాట్లాడాడు ఈయన.

ముఖ్యంగా అందరికీ థ్యాంక్స్ చెబుతూ వచ్చిన బన్నీ.. చివరికి తండ్రి అల్లు అరవింద్ దగ్గర ఆగాడు. ఆర్య సినిమా నుంచి ఇప్పటి వరకు తనతో తండ్రి చాలా సినిమాలు చేసాడని.. దాదాపు 8 వరకు నిర్మించాడని.. అందులో కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయని చెప్పాడు బన్నీ. కానీ ఎన్ని చేసినా.. ఎంత చేసినా కూడా ఇప్పటి వరకు తన తండ్రికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పలేదని.. ఇంట్లో కూడా ఎప్పుడూ చెప్పుకోలేదని గుర్తు చేసుకున్నాడు బన్నీ.

కానీ అందరిముందు ఎందుకో ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది అంటూ కన్నీరు పెట్టుకున్నాడు అల్లు అర్జున్. తండ్రిని చూస్తూ బాగా ఎమోషనల్ అయిపోయాడు. కనీసం మాట్లాడలేనంతగా ఏడ్చేసాడు అల్లు వారబ్బాయి. వెక్కివెక్కి ఏడ్చేసరికి కింద కూర్చున్న అల్లు బాబీ కూడా ఏడ్చేసాడు. ఇక చివరికి అల్లు అరవింద్ స్టేజీపైకి వచ్చి కొడుకును ఓదార్చాడు. ఈ సీన్ అంతా చూసి అక్కడున్న వాళ్లు కూడా ఎమోషనల్ అయిపోయారు. 

More Related Stories