English   

జాను అంటూ వస్తున్న శర్వానంద్, సమంత.. 

Sharwanand Samantha
2020-01-07 11:46:57

96.. తెలుగులో ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వినిపించిన పేరు. త‌మిళ‌నాట గతేడాది విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించిన ఈ చిత్రాన్ని ప్రేమ్ కుమార్ తెర‌కెక్కించాడు. విడుద‌లైన నాటి నుంచి నేటి వ‌ర‌కు ఈ చిత్రం గురించి టాపిక్స్ న‌డుస్తూనే ఉన్నాయి. క‌చ్చితంగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌ని భావించాడు దిల్ రాజు. అనుకున్నట్లుగానే ఇక్కడ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడు ఈ నిర్మాత. విడుద‌ల‌కు ముందే సినిమా చూసి రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. అయితే తీసుకున్న త‌ర్వాత చాలా రోజుల వరకు లీడ్ కాస్ట్ కోసం చూసిన దిల్ రాజు.. ఆ తర్వాత శర్వానంద్, సమంతను తీసుకున్నాడు. తమిళనాట తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు ప్రేమ్ కుమార్ ఇక్కడా దర్శకుడు. బ‌న్నీ.. నాని లాంటి హీరోలు కాదన్న తర్వాత శర్వా వచ్చాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయింది. దీనికి జాను అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. తాజాగా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. త్వరలోనే సినిమా విడుదల కానుంది. 

More Related Stories