English   

అల్లు అరవింద్‌కు పద్మశ్రీ.. కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే.. ఏంటి..

Allu Arjun
2020-01-07 12:07:09

ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో చాలా మందికి పద్మ అవార్డులు వరించాయి. కానీ అందులో అల్లు అరవింద్ మాత్రం లేరు. ఎన్నో దశాబ్ధాలుగా సినిమాల్లోనే ఉన్న ఈయనకు పద్మశ్రీ రావాలంటున్నాడు తనయుడు అల్లు అర్జున్. ఇదే కోరికను అల వైకుంఠపురములో స్టేజ్ పై నుంచి అందరికీ చెప్పాడు ఈయన. మనసులో మాటను ప్రేక్షకులతో పంచుకున్నాడు. 

ఈ వేడుకలో తన తండ్రి గురించి బన్నీ మాట్లాడుతూ.. నేను చాలా మందిని చూసుంటాను. నేను చూసిన వారిలో ది బెస్ట్ పర్సన్ మానాన్నే. పది రూపాయల వస్తువుని ఏడు రూపాయలకు బేరం చేసిన తర్వాత ఆరు రూపాయలు ఇవ్వండి అన్నా.. వాళ్లింటికి వెళ్లి ఏడు రూపాయలు ఇచ్చేసే వ్యక్తి మా నాన్నగారు. 45 ఏళ్లుగా ఓ వ్యక్తి సినిమాలు, వ్యాపారం చేస్తున్నారు. మనిషిలో ప్యూరిటీ లేకపోతే మనిషి ఇవాళ సౌత్ ఇండియాలో, ఇండియాలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ క్రింద ఉండలేరు.మా తాతగారికి పద్మశ్రీ వచ్చింది. అలాగే మా నాన్నగారికి కూడా పద్మశ్రీ రావాలనే కోరిక ఉండేది. కాబట్టి మా నాన్నకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని సభావేదిక నుండి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన అందుకు అర్హుడు. ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు.. ఆయనకు పద్మశ్రీ ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇదిలా ఉంటే ఒకరోజు ముందు సరిలేరు నీకెవ్వరు వేడుకలో సూపర్ స్టార్ కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే ఇవ్వాలంటూ చిరంజీవి రిక్వెస్ట్ చేసాడు. ఆయన ఇండియన్ సినిమాకు ఎంతో సేవ చేసారని.. అలాంటి వ్యక్తికి దాదాసాహెబ్ ఇచ్చి గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటూ అభిప్రాయపడ్డాడు మెగాస్టార్. మొత్తానికి అటు చిరంజీవి.. ఇటు అల్లు అర్జున్ అవార్డుల గురించి సిఫారసు చేయడం మాత్రం కొత్తగా అనిపించింది.

More Related Stories