English   

సూర్య ఆకాశమే నీ హద్దురా టీజర్‌ టాక్

suriya
2020-01-07 19:28:34

ఆరు, గజిని, యముడు, సింగం సిరీస్ సినిమాల ద్వారా తెలుగు నాట సూర్యకి మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే ఈ మధ్య ఆయన తెలుగు మార్కెట్ బాగా డల్ అయింది. "బందోబస్త్'' సినిమా ఇక్కడ సరిగా బిజినెస్‌ చెయ్యలేకపోయింది. బందోబస్త్ సినిమా రిలీజ్ అయ్యి నెల కూడా గడవలేదు అప్పుడే ‘సుధ కొంగర’ దర్శకత్వంలో ‘సురరై పోట్రు’ సినిమాని సిద్ధం చేస్తున్నాడు సూర్య. ఈ సినిమాని తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తుండడంతో ఈ సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. జేబులో 6 వేలు పెట్టుకుని విమానం కంపెనీ పెడతామని ఒకడొస్తే..ఎవడ్రా ఈ వీపీ గాడని ఈ లోకం వాడిని చూసి నవ్వింది అంటూ డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబు చెప్పే డైలాగ్స్‌తో షురూ అయ్యే ట్రైలర్‌ అంచనాలు పెంచే విధంగా ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ మీరు కూడా చూసెయ్యండి. 

 

More Related Stories