English   

రెజీనా కొత్త సినిమా...ఏమిటో తెలుసా

ragina
2020-01-07 19:58:52

‘ఎవరు’ చిత్రంతో చాలా ఏళ్ల తరువాత సక్సెస్ బాట పట్టింది రెజీనా. ఈ చిత్రంలో అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులను కొట్టేసింది. ఆ సినిమాతో ఆమె మళ్ళీ ఫాంలోకి వచ్చింది. ఇక ఆమె మీద కొన్ని పుకార్లు కూడా మొదలయ్యాయి. త్వరలో తమిళంలో ఓ సినిమాలో నటించనున్నదని అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోందని.. అది కూడా ఐటెం సాంగ్‌లో నర్తించడానికి ఈ బ్యూటి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్నట్టు ప్రచారం జరగుతోంది. ఈ చిత్రంలో రెజీనాను ఐటెం సాంగ్ కోసం సంప్రదించారట. అయితే ఆమె చేయనని చెప్పేసిందట. ఇక ఆమె తాజా సినిమా మీద ప్రకటన వచ్చింది రెజీనా ప్ర‌ధాన పాత్ర‌లో త‌న త‌ర్వాతి చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని, ఈ మూవీని రాజ శేఖ‌ర్ వ‌ర్మ .. యాపిల్ ట్రీ ప్రొడక్ష‌న్ బేన‌ర్‌పై నిర్మించ‌నున్నాడ‌ని సందీప్ కిష‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో నిను వీడ‌ని నీడ‌ను నేను సినిమా తెరకెక్కించిన కార్తీక్ రాజు ప్రకటించాడు. ఈ సినిమా కూడా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపొందుతుంది. చూడాలి ఈ సినిమా ఆమెకి ఇంకెంత పేరు తెచ్చిపెడుతుందో ? 

More Related Stories