English   

వామ్మో...బన్నీది ఒరిజినల్ కాదట...శ్రీ రెడ్డి ఉవాచ...

Sri Reddy Allu Arjun.jpg
2020-01-08 06:54:00

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్ళీ వార్తల్లో కెక్కింది. ఎప్పుడు ఎవర్నో ఒకరిని టార్గెట్ చేసి కామెంట్ చేయకుంటే ఆమెకి నిద్ర పట్టదేమో కానీ తాజాగా ట్రేండింగ్ లో అల్లు అర్జున్ ను టార్గెట్ చేసింది. ఆల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక రోజునే బన్నీ హెయిర్ స్టైల్ మీద కామెంట్ చేసింది. అయితే ఎప్పుడూ వాడు కామాంధుడు. వీడు కామాంధుడు అంటూ మనుషులను టార్గెట్ చేస్తూ పోస్టులను పెట్టె శ్రీరెడ్డి.

ఈ సారి మాత్రం రొటీన్ కు భిన్నంగా అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ ని టార్గెట్ చేసింది. తన ఫేస్‌ బుక్‌లో అల్లు అర్జున్ గురించి షాకింగ్ పోస్ట్‌ను షేర్ చేసింది. ‘‘అల్లు అర్జునా.. ఎప్పటికైనా నీ ఒరిజినల్ హెయిర్‌తో సినిమాల్లోకి వస్తావా? ఎప్పుడూ ఆ ఎక్స్‌టెన్సన్స్ విగ్ లేనా?’’ అంటూ సైటైర్లు వేసింది శ్రీరెడ్డి. దీంతో మేమేం తక్కువ తిన్నామా అంటూ బన్నీ ఫ్యాన్స్ కూడా ఆమె మీద విరుచుకు పడుతున్నారు.

బన్నీపై శ్రీరెడ్డి కామెంట్స్ చేయడం ఇది మొదటి సారి కాదు, ఆ మధ్య కేరళ వరదలు వస్తే వారి దగ్గ్గర కలెక్షన్స్ దొబ్బడం కాదు వాళ్ళకి కష్టం వచ్చింది సహాయం చేయమని ఆమె బన్నీని టార్గెట్ చేసింది.  కేరళ వరద బాధితులకు సహాయం చేయకుండా ఇలా 10 కోట్లు విలువ చేసే వానిటీ వ్యాన్స్ కొనుగోలు చేసుకోవడం ఎంతవరకూ కరెక్ట్ అంటూ ఆమె కామెంట్ చేసింది. కేరళలో బన్నీకి విశేషమైన ఫాలోయింగ్ ఉన్నా కానీ వారిని విస్మరించాడు అంటూ అప్పట్లో రచ్చ చేసింది.

మరి ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో చూడాలి.

More Related Stories