English   

పవన్ - అల్లు అర్జున్ లను కలపనున్న త్రివిక్రమ్

Pawan Kalyan Allu Arjun.jpg
2020-01-08 08:45:15

చెప్పను బ్రద‌ర్ అనే మాట బన్నీ నోటి వెంట ఏ ముహూర్తాన వచ్చిందో కానీ అది ఆయనకు చాలా చేటు చేసిందనే చెప్పాలి. ఆ ఒక్క మాట అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌తో వైరం పెట్టుకున్నాడు. ఆ ఒక్క మాట బ‌న్నీకి చాలా నష్టం కలిగించింది. బన్నీ పవన్-ఆయన ఫ్యాన్స్ మధ్య అదే గ్యాప్ కంటిన్యూ అయ్యింది. అయిత్గే ఆ మ‌ధ్య శ్రీ రెడ్డి ఇష్యూలో ఫిల్మ్ చాంబ‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరంగం సృష్టించ‌డంతో ఆ సమయంలో అక్కడికి వెళ్ళిన బన్నీ ప‌వ‌న్‌ కి మేము ఉన్నాం అంటూ వెళ్లి ఓ హ‌గ్ చేసుకోవ‌డం, ఆ తరువాత నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ప‌వ‌న్ క‌ల్యాణ్ అతిథిగా రావ‌డంతో ఇక వారి మధ్య దూరం తగ్గిందనే అందరూ అనుకున్నారు.

కానీ వీరిద్దరి మ‌ధ్య గ్యాప్ ఏమాత్రం త‌గ్గలేద‌ని ‘అల వైకుంఠ‌పుర‌ములో` ప్రమోషనల్ ఈవెంట్ నిరూపించింది. ఈ ఈవెంట్ చివరిలో బ‌న్నీ మాట్లాడుతున్న సమయంలో వేదిక కిందున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ‘ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ స్టార్‌’ అంటూ నినాదాలు చేసి బ‌న్నీ స్పీచ్  కి ఇబ్బంది కలిగించారు. దాంతో విసిగిపోయిన బన్నీ ‘మీఅంద‌రి కోసం ప‌వ‌ర్ స్టార్ గారూ.. అంటాను. కానీ ఈ క‌ట్టె కాలేంత వ‌ర‌కూ చిరంజీవి అభిమానినే’ అంటూ ఆ ఫ్యాన్స్‌కి కౌంట‌ర్ ఇచ్చాడు బ‌న్నీ. అయితే ‘మీరు ఆవేశ పడుతున్నారు కాబాట్టే ప‌వ‌న్ అనే పేరు ఎత్తుతున్నా లేదంటే ఆ అవసరం కూడా లేదనేట్టుంది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ కి ఆప్త మిత్రుడు గా పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సారి పవన్ తో బన్నీ దూరాన్ని తగ్గించే పని చేస్తున్నట్టు సమాచారం. అల వైకుంఠపురములో సినిమాని తెరకెక్కించిన కారణంగా వీరిద్దర్నీ కలిపి మాట్లాడించే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories