English   

జేఎన్‌యూకి దీపికా...ఢిల్లీలో ఆమె సినిమాలు బాయ్‌కాట్‌ 

 Deepika Padukone
2020-01-08 10:18:06

జేఎన్‌యూ దాడిలో గాయపడిన విద్యార్ధులను బాలీవుడ్ నటి దీపికా పదుకొనే  పరామర్శించారు. నిన్న ర్యాలీలో పాల్గొని విద్యార్ధులకు సంఘీభావం తెలిపారు. వర్సిటీలో జరిగిన దాడిని ఖండించారు. దీంతో వర్సిటీలోకి దీపికా వెళ్లడాన్ని ఢిల్లీ బీజేపీ ఖండించింది. దీపికా సినిమాలను ఢిల్లీలో బాయ్‌కాట్‌ చేయాలని పిలుపునిచ్చింది. ఈ ఘటనపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.

జేఎన్‌యూలోవిద్యార్ధులు, ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడింది తామేనని ప్రకటించింది హిందూ రక్షా దళ్. దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. జేఎన్‌యూలోవామపక్ష విద్యార్ధులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనని హిందూ రక్షా దళ్ విమర్శించింది. వామపక్ష విద్యార్ధి సంఘాలు తమ వైఖరి మార్చుకోకుంటే భవిష్యత్తులోనూ ఇలాంటి దాడులకే పాల్పడతామని హిందూ రక్షా దళ్ హెచ్చరిస్తూ వీడియో రిలీజ్ చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. జేఎన్యూ ఘటనకు హిందూ రక్షా దళ్‌కు  సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

More Related Stories