English   

ఆర్ఆర్ఆర్ కోసం మరో రియల్ విప్లవ వీరుడు

Rajamouli RRR
2020-01-08 10:30:10

టాలీవుడ్‌లో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ ఏడాదిలో సినీ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇదే అని చెప్పాలి. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్రధాన పాత్రల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ న‌టిస్తుండ‌గా, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఈ ఇద్దరూ పోరాట వీరులే. అసలు ఈ ఇద్దరూ కలిసనట్టు చరిత్రలో లేదు. కానీ కలిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.

బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే డెబ్బై శాతానికి పైగా పూర్తికాగా ఫిబ్రవరి నెలఖరికి దాదాపు పూర్తి  కావొచ్చని చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ యాక్ట్ చేస్తోంది.

తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అప్డేట్ వినిపిస్తోంది. అదేంటంటే ఈ సినిమా కోసం ప్రజా యుద్దనౌక, గాయకుడు గద్దర్ ఒక సినిమాలో ఒక విప్లవ గేయాన్ని రాసి ఆయనే పాడుతున్నట్టు ఆర్ఆర్ఆర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. తెలంగాణాకే చెందిన కొమరం భీమ్ మీద ఒక పాట రాయమని రాజమౌళి స్వయంగా గద్దర్‌ను కలిసి కోరారట. గద్దర్ కూడా తనకెంతో ఇష్టమైన కొమరం భీమ్ పై పాట రాసి పాటడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. అన్నీ కుదిరితే ఆర్ఆర్ఆర్ సినిమాకు గద్దర్ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

More Related Stories