English   

చేయనంటూనే ఆ పని చేస్తున్న యాంకర్ శ్యామల.. 

Anchor Syamala
2020-01-08 10:47:26

తెలుగులో ఉన్న హాట్ యాంక‌ర్స్ లో శ్యామ‌ల కూడా ఒక‌రు. ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తూనే.. చీర‌లోనే అందాలు ఆర‌బోస్తుంది ఈ భామ‌. పెళ్లి త‌ర్వాత కూడా హాట్ షోతో మ‌తులు పోగొడుతుంది. అన‌సూయ‌, ర‌ష్మి రేంజ్ లో కాక‌పోయినా.. శ్యామ‌ల‌కు కూడా మంచి ఫాలోయింగే ఉంది. తనకు కూడా ఎక్స్ పోజింగ్ చేయాలని ఉంటుందని అసలు విషయం చెప్పింది ఈమె. 

అయితే ఫ్యాన్స్ తిడుతున్నారని అందుకే తాను గ్లామర్ షోకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ. దానికితోడు తను హీరోయిన్ గా ఎందుకు మారలేదో కూడా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. అందంగా ఉంటుంది కాబట్టి ఈమెకు కొందరు హీరోయిన్ ఆఫర్స్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. కానీ ఆమె హీరోయిన్ కాకపోవడానికి కారణం తనే అని.. హీరోయిన్‌గా ఉండాలంటే బిజీ అయిపోవాలని చెబుతుంది. కానీ తను అంత బిజీగా ఉండలేనని.. అన్నింటికంటే ముఖ్యంగా తనకు తిండి నిద్ర అంటే ప్రాణం అంటుంది శ్యామల. కానీ హీరోయిన్ అయితే ఆ రెండు ఉండవని చెబుతుంది ఈమె. 

సినిమా హీరోయిన్ కావాలంటే చాలా బాధ్యతగా ఉండాలి.. దానికి మించి గ్లామర్ షో కూడా కోరుకుంటారు. అది తాను చేయలేనని.. అందాలు ఆరబోయడంతో పాటు స్లిమ్ గా ఉండటం అనేది తన వల్ల కాదని అందుకే హీరోయిన్ అవకాశాలు వచ్చినా కూడా చేయలేదని నిజం ఒప్పేసుకుంది శ్యామల. ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయింది ఈ యాంకర్. అయితే ఎక్స్ పోజింగ్ చేయనని చెప్పినా కూడా హాట్ డ్రస్ లలో మాత్రం కనిపిస్తుంది ఈమె. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ చూసి బాబోయ్ అంటున్నారు ప్రేక్షకులు. చేయనంటూనే చేస్తున్నావా శ్యామలా ఆంటీ అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. బ్లాక్ డ్రస్ లో అదిరిపోయే షో చేసింది ఈమె. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

More Related Stories