English   

అన్న కోసం త‌మ్ముడు.. ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఏర్పాట్లు.. 

NTR
2020-01-08 11:15:50

నందమూరి సోదరులు మళ్లీ ఒకచోట కలవబోతున్నారు. అన్నకోసం తమ్ముడు.. తమ్ముడి కోసం అన్నయ్య అన్నట్లుంటారు ఈ ఇద్దరు నందమూరి అన్నాదమ్ములు. వీళ్లను చూసి అభిమానులు కూడా ఫిదా అవుతుంటారు. ఇప్పుడు కూడా అన్నయ్య కోసం తమ్ముడు వస్తున్నాడు. 

కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా సినిమా జనవరి 15న విడుదల కానుంది. దాంతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 8న ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ అయినా కూడా ఈ చిత్రంపై ఆసక్తి బాగానే కనిపిస్తుంది. మెహ్రీన్ ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నటించింది. 

ఇదిలా ఉంటే అన్నయ్య కెరీర్ కోసం తమ్ముడు మాస్టర్ ప్లాన్ వేశాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ ను దగ్గరుండి చూసుకుంటున్నాడు నందమూరి తారక రామారావు. టాలెంట్ ఉన్నా కూడా ప్లానింగ్ లేక ఇన్నాళ్లు కళ్యాణ్ రామ్ చాలా ఇబ్బందులు పడ్డాడు. అందులో అతి ముఖ్యంగా తన సొంత ప్రొడక్షన్ హౌస్ లో వరుస సినిమాలు నిర్మించి కొన్ని కోట్లు నష్టపోయాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన ప్లాన్ వల్లే ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఇప్పుడు బయటికి వచ్చాడు. 

అన్నయ్యకు తమ్ముడు చెప్పిన సలహా ఒక్కటే.. సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు తీయడం కొన్ని రోజులు మానేయాలంటూ కళ్యాణ్ కు జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది. అందుకే జై లవకుశ సినిమా తర్వాత మళ్లీ నిర్మాణంలో మరో సినిమా రాలేదు. అన్నింటికంటే ముఖ్యంగా తాను హీరోగా బయటకు మాత్రమే సినిమాలు చేయాల్సిందిగా కళ్యాణ్ రామ్ కు జూనియర్ ఎన్టీఆర్ బాగా గట్టిగా చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఎలాగూ కళ్యాణ్ రామ్ కు మంచి ఇమేజ్ ఉంది ప్లస్ మార్కెట్ కూడా ఉంది దాన్ని ఉపయోగించుకుంటూ సినిమాలు చేయాలని అన్నయ్యకు సలహా ఇచ్చాడు ఈ తమ్ముడు. ఇప్పట్లో సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు చేయడం కొన్ని రోజులు ఆపేసి బయట ప్రొడక్షన్ లో సినిమాలు చేస్తే లాభం ఉంటుందని ఆయన చెప్పాడు. దాంతో ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. ఆయన సొంత నిర్మాణ సంస్థలో పటాస్, అతనొక్కడే మినహా ఇంత వరకు విజయం అందుకోలేదు. అందుకే రెండేళ్ల నుంచి తన ప్రొడక్షన్ లో సినిమాలు తీయడం ఆపేసాడు కళ్యాణ్ రామ్. 

జై లవకుశ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తీసుకొచ్చినా నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు చాలా లాభాలు తీసుకొచ్చింది. మొత్తానికి తమ్ముడు ఇప్పుడు అన్నయ్య కెరీర్ కూడా గాడిలో పడింది. 2019లో 118 సినిమాతో హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు సంక్రాంతికి మరో విజయం అందుకోవాలని చూస్తున్నాడు. మొత్తానికి తమ్ముడి సలహాలతో దూసుకుపోతున్నాడు నందమూరి వారసుడు. 

More Related Stories