English   

నాలుగు రోజుల ముందు అల వైకుంఠపురంలో ఫస్ట్ రివ్యూ..

 Ala Vaikunthapurramuloo
2020-01-08 12:35:30

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురంలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు వేల థియేటర్లలో విడుదల కానుంది. దానికి ఒక రోజు ముందు సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబు వస్తున్నాడు. దాంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ తారస్థాయిలో ఉంది. 

ఇదిలా ఉంటే విడుదలకు నాలుగు రోజుల ముందే అల వైకుంఠపురంలో ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. సెన్సార్ పూర్తి కావడంతో అక్కడి నుంచి రివ్యూ బయటకి వచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో త్రివిక్రమ్ మార్క్ ఎలివేషన్ సీన్స్ చాలానే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ డాన్స్ లు,  స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకు ప్రధాన హైలెట్ గా  నిలుస్తుందని ప్రచారం జరుగుతుంది. దానికి తోడు ఇంటర్వెల్  బ్యాంగ్ అద్భుతంగా వచ్చిందని.. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి మరో హైలైట్ అని తెలుస్తోంది. 

ఇక సెకండాఫ్ పూర్తిగా మాస్ ఆడియన్స్ కోసం త్రివిక్రమ్ డిజైన్ చేశాడని.. పైగా ఫైట్ సీక్వెన్స్ లు కూడా అలరిస్తాయని ప్రచారం జరుగుతుంది. అన్నింటికీ మించి డాన్స్ రూపంలో వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతుందని సినిమాకి ప్రధాన హైలైట్ లో అది కూడా ఒకటి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫైట్ సీక్వెన్స్ రామ్-లక్ష్మణ్ చిత్రీకరించారు. ఎప్పట్లాగే త్రివిక్రమ్ డైలాగులు ఈ సినిమాకు ప్రాణం. 

ఇప్పటికే ట్రైలర్ లో వచ్చిన మూడు డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని తెలుస్తోంది. క్లైమాక్స్ కూడా మెప్పిస్తుందని.. అత్తారింటికి దారేది తరహాలో ఎమోషనల్ క్లైమాక్స్ ప్లాన్ చేశాడని ప్రచారం జరుగుతోంది. నవదీప్, రాహుల్ రామకృష్ణ కామెడీ సీన్లు.. పూజా హెగ్డే తో అల్లు అర్జున్ రొమాంటిక్ ట్రాక్ సినిమాకి ప్లస్ అయ్యాయని అంటున్నారు. సంక్రాంతికి పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ అనేది మాత్రం అర్థం అవుతుంది. 

More Related Stories