English   

ట్రోల్స్ దెబ్బ...క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipligunj
2020-01-08 15:55:58

అక్కినేని నాగార్జున హోస్ట్‌‌ గా గతేడాది ప్రసారం అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3కి రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్‌ బాస్ విన్నర్‌గా నిలవడంతో రాహుల్ క్రేజ్ మరింత పెరిగి పోయింది. అయితే సాధారణ వ్యక్తిగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ఆ షో ద్వారా పెద్ద మొత్తంలో అందుకున్నాడు. గతంలో తాను చేసిన మ్యూజిక్ కన్సర్ట్స్ , పాడిన పాటలకు చాల తక్కువ సంపాదన వచ్చేదని దీంతో షోలో విజేతగా నిలిస్తే ఓ ఇల్లు కొనుక్కుంటానని అమ్మా నాన్నలను చక్కగా చూసుకుంటానని షోలో భాగంగా చెప్పాడు. 

అయితే ఈ షో తరువాత వరుసగా ఈవెంట్స్ చేసుకుంటూ పోతూ అటు సింగర్ గా, మరో పక్క సినిమాలలో నిటించే అవకాశం కూడా సంపాదించాడు. అయితే టైటిల్ గెలిస్తే అమ్మానాన్నలకు ఇల్లు కొనిస్తానని చెప్పిన రాహుల్ ఆ సంగతి చెప్పకుండానే కారుని కొనేశాడు. అది కూడా బెంజ్ లగ్జరీ కారు, అంటే దాని స్టార్టింగ్ మోడల్ 30 లక్షల నుండి ఉంది. దీంతో అతడు ఆ కారు కొన్న విషయాన్ని ఆకారు ఫోటోలని నెటిజన్లతో పంచుకున్నాడు.దీంతో కొంత మంది నెటిజన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇల్లు కొనకుండా నీకోసం కారు కొనుకున్నవా అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో  రాహుల్ తాజాగా ఈ విషయంపై స్పందించాడు. ఫ్లాట్ కొనేసినా మీరేం టెన్షన్ పడకండి..అది రెడీ కానీకి ఏడు నెలలు సమయం పడుతుంది. నేను ధమ్స్ అప్ తాగుతున్నా. జస్ట్ చిల్ అంటూ పోస్ట్ చేశారు.

More Related Stories