English   

దర్బార్ ప్రివ్యూ.. రజినీకాంత్ హిట్ కొట్టేలా ఉన్నాడే..

Darbar Movie Pre review
2020-01-08 18:05:13

రజినీకాంత్ దర్బార్ సినిమా మరికొన్ని గంటల్లోనే విడుదల కానుంది. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే తెలుగులో మాత్రం ఈ చిత్రానికి చెప్పుకోలేని కష్టాలు వస్తున్నాయి. ఒకప్పుడు రజినీ సినిమా వచ్చింది అంటే థియేట్రికల్ రైట్స్ కోసం ఎగబడి కొనేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు. పదేళ్ల కింద వచ్చిన రోబో సినిమాను కూడా తెలుగులో 30 కోట్లకు కొన్నారు. ఆ తర్వాత కబాలి, 2.0 సినిమాలు కూడా మంచి బిజినెస్ చేశాయి. 

కానీ ఇప్పుడు మాత్రం చాలా దారుణమైన బిజినెస్ జరుగుతుంది. దర్బార్ సినిమాను కొనడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వార్త అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. జనవరి 9న తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఈ సినిమా. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ చిత్రంపై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ బాగుండటంతో తెలుగులో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. 

ఇక ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను కేవలం 7.5 కోట్లకు అమ్మారు దర్శక నిర్మాతలు. గతంలో రజనీ సినిమా అంటే కనీసం 20 కోట్లకు పైగా బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు దర్బార్ ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా తక్కువగానే జరిగింది. తమిళనాట 63 కోట్లు.. హిందీలో 17 కోట్లు.. కేరళలో 5.5 కోట్లు.. కర్ణాటకలో 7 కోట్లు.. ఓవర్సీస్ 33 కోట్లు.. డిజిటల్ అమేజాన్ 25 కోట్లు.. ఆడియో 5 కోట్లు కలిపి మొత్తం 196 కోట్ల బిజినెస్ చేసింది ఈ చిత్రం. 

తెలుగులో సంక్రాంతికి మరో మూడు భారీ సినిమాలు ఉండటంతో రజనీకాంత్ కు ఎంత వరకు థియేటర్లు వస్తాయనేది అనుమానమే. అయితే తొలి రెండు రోజులు మాత్రం దాదాపు 750 స్క్రీన్స్ దొరికాయి. దాంతో పాజిటివ్ టాక్ వస్తే పండగే ఇంక. నాలుగేళ్లుగా వరుస పరాజయాలతో రజనీకాంత్ కెరీర్ చాలా డైలమాలో ఉంది. మరి ఇప్పుడు దర్బార్ సినిమాతో ఆయన ఏం చేస్తాడో చూడాలి.

More Related Stories