English   

నానికి అన్నగా జగపతిబాబు

jaggu
2020-01-09 05:05:32

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా “టక్ జగదీష్” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఒక పోస్టర్ ను యూనిట్ రోజు రిలీజ్ చేసింది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను నిన్ను కోరి, మజిలీ సినిమాలు తెరకెక్కించిన సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ నెల నుండి షూటింగ్ కి వెళ్లనుంది. ఇక ఈ సినిమా గురించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్తా వినిపిస్తోంది. ఈ సినిమాలో నాని ఐదుగురు అన్నదమ్ముల్లో ఒకడిగా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ అన్న్డంములో ఒకరిగా నానికి అన్నయ్యగా వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో కీలకమైన హీరో అన్నయ్య పాత్రలో జగపతిబాబును సంప్రదించి నట్టు చెబుతున్నారు. ఇక నాని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ V. ఈ సినిమాని మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నారు. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

More Related Stories