English   

చిరంజీవి సినిమాలో చరణ్ కూడానట...అందుకే

charan
2020-01-09 05:14:52

సైరా నరసింహారెడ్డి హిట్‌తో మంచి జోష్‌ మీద ఉన్న చిరు అంతే జోష్ తో 152వ సినిమా మొదలు పెట్టారు. విజయదశమి సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిపి కొణిదెల ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మొన్ననే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. చిరంజీవితో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడ‌నే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో అది ఈ సినిమా కోసమే అని ప్రచారం మొదలయింది. మెగా తండ్రీ కొడుకులు క‌లిసి ఇప్పటికే మూడుసార్లు ఒకే స్క్రీన్‌పై క‌నిపించారు. ప‌దేళ్ల కింద ‘మ‌గ‌ధీర‌’లో త‌న‌యుడితో క‌లిసి న‌టించిన చిరు, ఆ త‌ర్వాత మూడేళ్ల కింద ‘బ్రూస్లీ’లో మ‌రోసారి మెరిశాడు. చరణ్ ఏమో ‘ఖైదీ నెం.150’లో పాట‌లో చిరుతో కలిసి రెండు స్టెప్పులేసాడు. 

ఇక ఇప్పుడు నాలుగోసారి చిరు, చ‌ర‌ణ్ క‌లిసి ఈ సినిమాలోనే నటించబోతున్నారని అంటున్నారు. ఈ క‌థ‌లోనే ఓ ప‌వ‌ర్ ఫుల్ రోల్ చ‌ర‌ణ్ కోసం డిజైన్ చేశారట కొర‌టాల‌. ఆ పాత్ర చ‌ర‌ణ్ త‌ప్ప వేరే ఎవ‌రు చేసినా కూడా సూట్ కాద‌ని భావించి ఆయ‌న్ని ఒప్పించి ఫ్లాష్ బ్యాక్‌లో వ‌చ్చే ఈ పాత్ర చ‌ర‌ణ్‌తో చేయించాల‌ని చూస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. సినిమాకు నిర్మాత కూడా ఆయనే కాబట్టి ఆ పాత్ర చేస్తే మార్కెట్ కూడా పెరుగుతుంది కాబట్టి చరణ్ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫిబ్రవరి చివరికి పూర్తి కానుందని, ఆ తరువాత చిరంజీవి సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటారని అంటున్నారు. చరణ్ పాత్ర షూటింగ్ పూర్తి అయ్యాకనే చరణ్ కొత్త మూవీ ని అనౌన్స్ చేస్తారని అంటున్నారు. 

More Related Stories