English   

మళయాళ ఫ్యాన్స్ కోసం మరో ఈవెంట్ ప్లాన్ చేసిన బన్నీ

allu
2020-01-09 12:26:51

అల్లు అర్జున్ కు తెలుగునాటే కాదు మళయాళంలోనూ ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగుతో పాటు మలయాళంలో కూడా మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంటాయి. అందుకే బన్నీ తన సినిమాలు కేరళ రిలీజ్ కు ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు. అందుకే  అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న  ‘అల వైకుంఠపురంలో’ ని సైతం అక్కడ బారీగా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు . “అంగు వైకుంఠ‌పుర‌త్తు” అనే టైటిల్‌తో మ‌ల‌యాళ వ‌ర్షెన్ సంక్రాంతి కానుకగా జనవరి 12నే విడుద‌ల కానుంది. కేరళ రాష్ట్రంలో అభిమానులు అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని పిలుచుకొంటారు. ఇక ” అంగు వైకుంఠపురత్తు ” మూవీ రిలీజ్ సందర్భంగా అభిమానుల కొరకు అల్లు అర్జున్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ ఈవెంట్ కు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య అతిథి గా పాల్గొంటారని చెబుతున్నారు. ఇక ఈ విషయమై అక్కడ మీడియా సైతం ప్రత్యేక కథనాలు వెలువరిస్తోంది. మళయాళ మీడియాలోనూ ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించిన వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సినిమా గురించి అక్కడ క్రేజ్ మామూలుగా లేదు. దీని మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

 

More Related Stories