English   

రజనీకాంత్ దర్బార్ ఫస్ట్ రివ్యూ.. ఓవర్సీస్ టాక్..

Darbar First Review.jpg
2020-01-09 07:43:14

రజనీకాంత్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం దర్బార్. సర్కార్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 వేల ధియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. చాలా రోజుల తర్వాత రజనీకాంత్ సినిమాకు తొలి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా తమిళనాట అయితే రజనీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అక్కడ పొంగల్ కు పెద్ద సినిమా ఏది లేకపోవడంతో రజనీ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అయిపోయింది.

పోలీస్ ఆఫీసర్ గా సూపర్ స్టార్ అదరగొట్టాడు అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా తెలిసిన కథే అయినా కూడా మురుగుదాస్ అద్భుతమైన స్క్రీన్ ప్లే తో సినిమా రేంజ్ మార్చేశాడు అంటున్నారు ఆడియన్స్. బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా రజినీకాంత్ నటన అదిరిపోయిందని.. మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పడుతుందని చెబుతున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. కొన్నేళ్లుగా అసలైన బ్లాక్ బస్టర్ కోసం వేచిచూస్తున్న చూస్తున్న రజనీకాంత్ కు దర్బార్ సినిమాతో ఆ లోటు తీరిపోతుంది నమ్మకంగా చెబుతున్నారు చిత్ర యూనిట్. తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించడం ఖాయం అంటున్నారు. ఎటు చూసుకున్న కూడా దర్బార్ సినిమా మంచి టాక్ తో ఓపెన్ అయింది. మరి దీన్ని సంక్రాంతి సీజన్లో రజినీకాంత్ ఎలా వాడుకుంటారో చూడాలి.

More Related Stories