English   

ఆ ఫంక్షన్ కి జనం వచ్చారా.. ఓ హీరోపై పెద్ద హీరో సెటైర్..

Mahesh Babu Allu Arjun Comments.jpg
2020-01-09 08:26:44

టాలీవుడ్ లో ఇద్దరు అగ్ర హీరోలే. ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎవరికి వాళ్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాదాపు 70 నుంచి 100 కోట్ల మార్కెట్ మధ్యలో వాళ్ళ సినిమాలు కలెక్ట్ చేస్తుంటాయి. అలాంటి ఇద్దరు హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నారు. అయితే అందులో ఒక హీరో పై మరో హీరో ఇప్పుడు సెటైర్ల వర్షం కురిపించాడు అని తెలుస్తోంది.

పైకి చాలా కామన్ గా కనిపించే ఆ హీరోలో వెటకారం మాత్రం చాలా ఎక్కువగా ఉందని.. తనకు పోటీగా వస్తున్న హీరోను కనీసం పోటీగా కూడా తీసుకోకుండా తన రేంజ్ వేరు అంటూ సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య జరిగిన ఒక వేడుక పై ఈ పెద్ద హీరో వేసిన సెటైర్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారుతుంది. కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. మనం ఏదో చేస్తే వాడు కూడా అదే చేస్తాడా అంటూ మరో హీరోపై ఈ స్టార్ తనదైన శైలిలో సెటైర్లు వేసాడని.. అసలు వాడి ఫంక్షన్ కు జనం వచ్చారా అంటూ సెటైరికల్ గా తన సన్నిహితులతో జోకులు పేలుస్తున్నాడని తెలిసిన వాళ్ళు చెబుతున్న మాట.

ఏదేమైనా సినిమాల్లోనే కాదు బయట కూడా ఆయనకు ఒళ్లంతా వెటకారం ఉంటుందని.. ఎంతమంది వచ్చినా తాను సింగిల్ పీస్ మిగతా వాళ్ళు మనకి పోటీ కాదు అంటూ చాలా నమ్మకంగా ఉన్నాడు అని ప్రచారం జరుగుతోంది. మరి ఆ ఇద్దరు అగ్ర హీరోలు ఎవరో.. వాళ్ల మధ్య జరుగుతున్న బాక్సాఫీస్ పోటీ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

More Related Stories