అసురన్ రీమేక్ లోకేషన్స్ ఓకే...ఆరోజు నుండే షూట్

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ సినిమాని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఆయన సోదరుడు, నిర్మాత డి. సురేష్ బాబు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఈ నెల 20న నుండి మొదలుకానుందట. ఈ సినిమా సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ఈ సినిమాని అనంతపురంలో షూటింగ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అక్కడ అయితే షూట్ కి పెద్దగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట.హైదరాబాద్ లోనూ కొంతమేర షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ లొకేషన్లు కూడా ఫైనలైజ్ అయ్యాయని వినికిడి. ఈ సినిమా షూట్ వీలయినంత వేగంగా చేసి ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. వెంకీకి జోడీగా ప్రియమణి నటించనున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతమందించనున్నాడు. ఇక మిగతా నటీనటులందరినే కొత్తవాళ్లనే తీసుకోనున్నారట.