English   

అల వైకుంఠపురంలో యూనిట్ కి షాక్...రిలీజ్ ముందు కేసు

 Ala Vaikunthapurramloo
2020-01-09 10:20:46

సినిమా వాళ్ళమే కదా ఏమైనా చేయచ్చు అనుకునే వాళ్ళకి షాకిచ్చారు హైదరాబాద్ పోలీసులు. అదేంటి అనుకుంటున్నారా ? రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన అల వైకుంఠపురం సినిమా మ్యూజికల్ ఈవెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ మీద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులకు విరుద్ధంగా గడువు ముగిసిన తరువాత కూడా కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా శ్రేయాస్‌ మీడియా ఎండీ శ్రీనివాస్‌తో పాటు హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ మేనేజర్‌ యగ్నేష్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. 

‘అల వైకుంఠపురంలో’ సినిమా మ్యూజిక్‌ కన్సర్ట్‌ కు సంబందించి ఈ నెల 2న హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ మేనేజర్‌ కె.యగ్నేష్‌ పోలీసుల అనుమతి తీసుకున్నారు. వేడుకకు 5 నుంచి 6వేల మంది హాజరవుతారని రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం ముగుస్తుందని ఆయన పోలీసులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నాడు. కానీ ఈ ఈ కార్యక్రమం 11.30 గంటల వరకు కొనసాగింది. గంటన్నర అదనంగా కార్యక్రమాన్ని కొనసాగించడమే కాక దరఖాస్తులో ఆరువేల మందికి మాత్రమే పాస్‌లు ఇచ్చామని చెప్పిన నిర్వాహకులు దాదాపు 15వేల మందిని ఆహ్వానించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

అందువలన ఈ వేడుకలో తొక్కిసలాట జరగడమేగాక వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో యూసుఫ్‌ గూడ రోడ్స్ అన్నీ బ్లాక్ అయ్యి పోలీసులు వీరిని నియంత్రించలేకపోవడం వలన తీవ్రమైన ట్రాఫిక్ జాం ఏర్పడింది. కార్యక్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం వలెనే ఇదంతా జరిగిందని దీనికి కారకులైన ఆ ఇద్దరి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

More Related Stories