పూరీ విజయ్ సినిమా షూట్ అప్పటి నుండే

విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో ఫైటర్ అనే సినిమా మొదలు కాబోతోంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుండగా ఈ సినిమా ద్వారా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయిక గా టాలీవుడ్ కు పరిచయం అవబోతోందని కూడా ప్రచారం జరిగింది. ఈ సినిమా 13న సెట్స్ పైకి వేళ్లేందుకు రెడీ అయిందని అంటన్నారు. ఇక ఈ సినిమా షూట్ ముంబైలో జరగనుందని అంటున్నారు. సినిమాలో విజయ్ మార్షల్ ఆర్ట్స్ చేయనున్నారు. సినిమా కోసమే విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో మెళకువలు కూడా నేర్చుకొన్నాడట. ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నారు. ఇందులో రమ్యకృష్ణ విజయ్‌కి తల్లిగా నటించనుందనేది తాజా సమాచారం. అయితే కథానాయికగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుందని ప్రచారం జరిగినా ఆమె తప్పుకునే అవకాశమే ఎక్కువ అని అంటున్నారు.