English   

ఆ హీరోలా ఉండాలనుకున్నా బన్నీ వల్ల కాలేదట 

Allu Arjun
2020-01-09 13:19:02

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ గా పేరొందిన అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ గురించి అలాగే బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.  ‘అల వైకుంఠపురం’ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా బన్నీ కొన్ని ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 

తనకు స్టైలిష్ స్టార్ అనే టాగ్ ఉన్నా సరే విజయ్ దేవరకొండ కి మరియు రణవీర్ సింగ్ కి మంచి స్టైల్ సెన్స్ ఉందని అన్నారు. విజయ్ దేవరకొండ అంటే తనకి ఇష్టమని అతనికి ఒక దుస్తుల బ్రాండ్ ఉందని దానికోసం కష్టపడుతుంటాడని చెప్పుకొచ్చారు. అలాగే బాలీవుడ్ లో  రణవీర్ సింగ్ స్టైల్ అంటే ఇష్టమని అల్లు అర్జున్ అన్నారు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ని ఖచ్చితంగా ప్రశంసించాలని ఆయనలా ప్రత్యేకమైన దుస్తుల్ని ధరించడానికి ప్రయత్నించా కానీ నా వల్ల కాలేదని అన్నారు. దాన్ని ఫాలో అవ్వాలంటే దానికి తగ్గ ఆటిట్యూడ్ ఉండాలని బన్నీ అభిప్రాయపడ్డాడు. ఎంతోమంది టాలీవుడ్ లో స్టైలిస్ట్ లు ఉన్నప్పటికీ తాను ప్రత్యేకంగా ఓ హెయిర్ స్టైలిస్ట్ ని నియమించుకున్నానని చెప్పుకొచ్చాడు.

More Related Stories