English   

చిరుకు జగన్ సీటు ఆఫర్...అందుకే మద్దతు...

Chiranjeevi Jagan AP CM.jpg
2020-01-09 23:26:44

మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఖరారైంది అది కూడా తన తమ్ముడు రాజకీయంగా తలపడుతున్న వైసీపీ తరపున. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న వార్తల్లో ఇదొకటి.ఈ వార్త ఇప్పటికిప్పుడు ఇలా పుట్టుకు రాడానికి కారణం. ఏపీ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ  బోతున్నాయి. ఈ నాలుగు స్థానాలు కూడా ఎమ్మెల్యేల సంఖ్యా రీత్యా వైసీపీకే దక్కనున్నాయి. అందులో ఒకటి చిరంజీవికి ఇవ్వాలని సీఎం జగన్ ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

జనసేన నుంచి కాపు వోట్ బ్యాంక్ ని చీల్చేందుకు చిరంజీవిని ర్గెట్ చేసి... రాజ్యసభకు పంపాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గత నెల సైరా సినిమా సమయంలో చిరంజీవి జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో రాజకీయల చర్చలేమీ జరగలేదని చెబుతున్నా అప్పుడే జగన్ చిరంజీవి ముందు రాజ్యసభ సీటు ప్రపోజల్ పెట్టారట. అయితే దీనికి చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించినట్టు చెబుతున్నారు. అందుకే రాజధాని విషయంలో పవన్ వ్యక్తిరేకిస్తున్నా చిరంజీవి జగన్ కు మద్దతు పలికారు. రాజ్యసభ సీటు కోసమే ఆయన ఈ మద్దతు ఇచ్చారని అంటున్నారు.

జగన్ ప్రభుత్వం ఏర్పడిన రెండో నెలలో చిరంజీవి విశాఖ పరిసర ప్రాంతాల్లో 650 ఎకరాలు భూమి కూడా కొన్నారట, అంటే రాజధాని విశాఖకు మారుస్తార్నై చిరంజీవికి ముందే ఇన్ఫర్మేషన్ కూడా వెళ్లిందట.  ప్రచారం అయితే జరుగుతోంది కానీ ఇందులో నిజం ఎంత ఉంది అనేది వేచి చూడాల్సి ఉంది.

More Related Stories