English   

సంక్రాంతికి సైరా.. గణతంత్ర దినోత్సవం రోజు సాహో..

syeraa
2020-01-10 05:09:07

తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచిన సినిమాల్లో బాహుబలి ముందు ప్లేస్ లో ఉంటే ఆ తర్వాత సాహో, సైరా ఉంటాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే వచ్చాయి. బాలీవుడ్ సినిమాలను సైతం తలదన్నేలా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకులు. అయితే రిజల్ట్ తేడా వచ్చినా కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాలు ఈ రెండు. ఇక ఇప్పుడు ఈ సినిమాలు ఇప్పుడు టీవీలో రానున్నాయి. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి సినిమా జెమినీ టీవీ భారీ రేటుకు శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. సంక్రాంతి కానుకగా సైరా సినిమా స్పెషల్ ప్రీమియర్ అంటూ ప్రదర్శించనున్నారు జెమిని. దీనికి భారీగా టిఆర్పి రేటింగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు ఛానల్ యాజమాన్యం. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ కూడా చేసుకుంటున్నారు. 10 రోజుల ముందు నుంచి స్పెషల్ ప్రోమోలు కట్ చేసి ప్లే చేస్తున్నారు. సంక్రాంతి రోజు సైరా నరసింహారెడ్డి టీవీలో ప్లే కానుంది. జనవరి 9తో సరిగ్గా 100 రోజులు పూర్తి చేసుకుంది సైరా నరసింహారెడ్డి. ఇక సాహో సినిమా తెలుగులో ఎవరూ కొనలేదు. నిర్మాతలతో లెక్కల పరంగా తేడా రావడంతో తెలుగులో సాహో శాటిలైట్ కాలేదు. కానీ హిందీలో మాత్రమే ఈ సినిమాను జీ టెలివిజన్ భారీ రేటు ఇచ్చి దక్కించుకుంది. రిపబ్లిక్ డే కానుకగా సాహో సినిమాను జి టీవీలో ప్లే చేయనున్నారు. తెలుగులో సాహో ఫ్లాప్ అయినా హిందీలో మాత్రం 150 కోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో అక్కడ టీఆర్పీ రేటింగ్స్ బాగానే వస్తాయని ఆశిస్తున్నారు ఛానల్ యాజమాన్యం. మొత్తానికి 2019లో తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచిన సినిమాలు ఇప్పుడు టీవీలో కనిపించనున్నాయి.

More Related Stories