English   

మీకు అర్ధమవుతోందా... గీతా మాధురిని అలా వాడేశాడు అనిల్

geetha
2020-01-10 05:17:18

అన్ని బాషల సంగతి ఎలా ఉన్నా మన తెలుగులో ఒక్కో దర్శకుడికీ ఒక్కో మార్క్ ఉంటుంది. ఆ మార్క్ ఏర్పడే వరకూ ఏమో కానీ అది ఏర్పడిందంటే దానిని నిలబెట్టుకోడానికి చేయని ప్రయత్నాలు ఉండవు. అంటే రాఘవేంద్ర రావు సినిమాల్లో హీరోయిన్ల బొడ్డుపై పూలు, పళ్ళు విసరడం, ఆర్ నారాయణ మూర్తి సినిమాలో విప్లవ పాటలు, కొరటాల శివ సినిమాల్లో ఒక మెసేజ్, పూరి సినిమాల్లో హీరో బేవార్స్ గా తిరగడం లాంటివి ఈ కోవలోకే వస్తాయి. అయితే అది స్టైల్ అనాలో ఇంకేమనాలో తెలీదు కానీ హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాల్లో కూడా ఒక కామన్ పాయింట్ ఉంది. అదే ఊతపదం. అనిల్ రావిపూడి దర్శకుడిగా చేసిన నాలుగు సినిమాలు పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వీటిల్లో కామెడీ బాగుంటుంది. ఆ కామెడీ హైలైట్ కావడానికి ఆయన ఎంచుకున్న అంశం ఊతపదం. పటాస్ సినిమాలో పార్థాయ ప్రతి బోధితాం అంటూ వచ్చే భగవద్గీత కానీ, సుప్రీమ్ సినిమాలో జింగ్ జింగ్ అమేజింగ్ కానీ, రాజా ది గ్రేట్ చిత్రంలో ఇట్స్ లాఫింగ్ టైమ్ కానీ, ఎఫ్ 2 లో అంతేగా అంతేగా లాంటి పదాలు ప్రేక్షకులకి గుర్తుండి పోతాయి.

ఇప్పుడు ఆయన మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేశారు. ఈ సినిమాలో కూడా తన మేకింగ్ తగ్గకుండా ఆయన కామెడీ  ట్రాక్స్ ఎక్కించాడు. ఎప్పటి లానే ఇందులో కూడా తనకు కలిసొచ్చిన ఊతపదాన్ని ఇందులో కూడా ఒకటి సృష్టించాడట. అదే ‘నీకు అర్థమౌతోందా’?? అనేది. ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్‌లో ఫేమస్ అయిపోయిన డైలాగ్ ఇది. హీరోయిన్ రష్మిక.. నీకు అర్థమౌతోందా? అంటూ చేయి అడ్డంగా పెట్టి చెప్తున్న ఈ డైలాగ్ టిక్ టాక్ ఇతర యాప్‌లలో వైరల్ అవుతోంది.

ఇంత పాపులర్ అవుతున్న ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుగా ఉందే అంటూ ఆలోచనలో పడ్డ నెటిజన్లకు అసలు విషయం భోధ పడింది. ట్రైలర్‌లో ‘నీకు అర్ధమౌతోందా?’ అంటూ రష్మిక అతి కష్టంగా పట్టి పట్టి చెప్తున్నట్టు ఆమెకు సెట్ కానట్టు ఉన్న ఈ డైలాగ్ బిగ్ బాస్‌లో గీతా మాధురి దగ్గర నుండి ఎత్తుకొచ్చిందేనట. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్‌లో 2లో గీతా మాధురి ఫైనల్‌ వరకూ వెళ్లి కౌశల్‌కి విన్నర్ టైటిల్‌ని ఇచ్చేసి.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే హౌస్‌లో ఆమె ఊతపదం ‘నీకు అర్ధమౌతోందా’ మాత్రం బాగా ఫేమస్ అయ్యింది. అక్కడ నుండి ఎత్తిందే ఈ మ్యానరిజం అని అంటున్న్నారు.

More Related Stories