English   

వాటిని తొక్కి పెడుతున్న బన్నీ, మహేష్ లు

allu
2020-01-10 05:24:36

ప్రస్తుతం సోషల్ మీడియా పీక్స్ లో ఉన్న పరిస్థితుల్లో బడా సినిమాలే కాదు అసలు సినిమాల భవితవ్యమే రివ్యూస్ మీదా ఆధారపడి ఉంటోంది. రివ్యూస్ అనేవి చాలా వేగంగా వస్తున్నాయి. సినిమా విడుదలైన కొన్ని క్షణాల్లోనే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నవి కొన్నయితే ఏకంగా సినిమా జరుగుతున్నపుడే లైవ్ అప్ డేట్స్ అంటూ ఇస్తున్నవి మరికొన్ని. ఇలాంటి సమయంలో రివ్యూస్ బయటికి రాకుండా ఆపడం అనేది సాధ్యం కాదు.. కానీ బన్నీ, మహేష్ మాత్రం ఆ రివ్యూలు బయటకు రాకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. 

తర్వాత రివ్యూస్ ఆపడం అనేది అసాధ్యం అనుకొండి. కానీ విడుదలకు ముందే ప్రీమియర్ షో రివ్యూస్, సెన్సార్ రివ్యూస్ అంటూ కొన్ని వస్తుంటాయి. అందులో  ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దుబాయ్ నుంచి వచ్చే టాక్. అక్కడ ఉమైర్ సంధూ అనే రివ్యూ రైటర్ ప్రతీ సినిమా విడుదలకు మూడు రోజుల ముందే తన రేటింగ్ ఇస్తుంటాడు. సినిమాకు పాజిటివ్స్, నెగిటివ్స్ అంటూ రాస్తుంటాడు. అలాంటి రివ్యూలపైనే ఇప్పుడు మహేష్, బన్నీ టీం ఫోకస్ చేసిందని తెలుస్తుంది. అందుకే ఈ రెండు సినిమాకు ఆ క్రిటిక్ నుండి ఒక్క రివ్యూ కూడా రాలేదాట. ఇక దుబాయ్ రివ్యూతో పాటు ముందు రోజు యుఎస్‌లో పడే ప్రీమియర్ షో రివ్యూలను కూడా సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఈ హీరోలు ఇద్దరూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

More Related Stories