అల వైకుంఠపురములో సినిమాకు జగన్ సంక్రాంతి గిఫ్ట్...

ఏపీలో సంక్రాంతి సినిమాలకు బాగానే టైమ్ కలిసొస్తుంది. అక్కడ సీఎం జగన్ వాళ్లకు బాగానే ఆఫర్స్ ఇస్తున్నాడు. నిన్న మహేష్ బాబుకు ఇచ్చిన జగన్.. ఇప్పుడు బన్నీకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈయన అల వైకుంఠపురములో సినిమాకు ఆరు షోలు వేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. ఈయన కంటే ముందే మహేష్ బాబు సినిమాకు కూడా అనుమతి వచ్చేసింది.
ఇప్పుడు బన్నీ కూడా లైన్ లోకి వచ్చేసాడు. అర్ధరాత్రి 1 నుంచి 10 గంటల మధ్యలో ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చు అంటూ అనుమతి ఇచ్చింది గవర్నమెంట్. దాంతో డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకుంటున్నారు బయ్యర్లు. సినిమాకు టాక్ బాగొస్తే మాత్రం వారం రోజుల పాటు వసూళ్లకు ఏ మాత్రం ఢోకా ఉండదు. విడుదల కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సరిలేరు నీకెవ్వరు ఉన్నా కూడా అల వైకుంఠపురములో కూడా దాదాపు 1000 స్క్రీన్స్‌లో విడుదలవుతుంది.
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్ లో బన్నీ చేసిన సినిమా ఇది. అందుకే ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. జనవరి 12న విడుదల కానుంది ఈ చిత్రం.