సంక్రాంతి పోరు మరికాసేపట్లో.. బన్నీ వర్సెస్ మహేష్..

సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్ నిజంగానే నువ్వా నేనా అనుకుంటున్నారు. పందెం కోళ్ల మాదిరే కొట్టుకుంటున్నారు. ఇప్పటికే రజినీకాంత్ దర్బార్ సినిమా వచ్చింది. ఈ చిత్రానికి టాక్ కూడా పర్లేదు అంటున్నారు ఆడియన్స్. అయినా కూడా ఈ సినిమా కంటే కూడా మన సినిమాలు ఎప్పుడొస్తాయా అని వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు, బన్నీ ఈ పండక్కి పందెంకోళ్లలా కొట్టేసుకుంటున్నారు. ఈ రెండు సినిమాలపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అసలు ఈ రెండు సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
దానికి తగ్గట్లుగానే ఒకరు జనవరి 11న.. మరొకరు 12న డేట్స్ కూడా ఫిక్స్ చేసారు. ముందు మహేష్ బాబు.. తర్వాత బన్నీ రావాలనుకున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ అసలు రచ్చ మొదలైంది. ఈ రెండు సినిమాల బిజినెస్ కూడా అంతే హై లో జరుగుతుంది. ఇద్దరూ సంక్రాంతి సీజన్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే బిజినెస్ దాదాపు 100 కోట్ల వరకు చేసారు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు.. 12న బన్నీ వచ్చేస్తున్నారు.
మహేష్ సినిమా ట్రైలర్.. బన్నీ సినిమా పాటలు బాగా హిట్ అయ్యాయి. మరి ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో చూడాలిక.