English   

నయనతారను మళ్లీ మోసం చేసిన మురుగదాస్..

Nayanthara
2020-01-10 09:31:41

నమ్మడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ ఇది నిజమే. నిజంగానే ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతారను మోసం చేశాడు మురుగదాస్. ఈమె తాజాగా రజనీకాంత్ హీరోగా వచ్చిన దర్బార్ సినిమాలో నటించింది. ఈ సినిమా దర్శకుడు మురుగదాస్ గతంలో సూర్య హీరోగా వచ్చిన గజిని సినిమాలో హీరోయిన్ గా నటించింది నయన. ఆ సినిమాలో ఆమె పాత్రకు చాలా విమర్శలు వచ్చాయి. అప్పటికి కెరీర్ కొత్త కావడంతో తనకు చెప్పిన కథ కాకుండా మరోలా సినిమాను తెరకెక్కించాడు అంటూ మురుగదాస్ పై అప్పట్లో కొన్ని విమర్శలు చేసింది నయనతార. 

మళ్లీ దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆయన దర్శకత్వంలో దర్బార్ సినిమా చేసింది. ఇప్పుడు కూడా ఆమెకు మళ్ళీ షాక్ ఇచ్చాడు దర్శకుడు. ఈ సినిమాలో పేరుకు నయనతార హీరోయిన్ కానీ అసలు ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. సినిమా అంతా కలిపి కనీసం అరడజను సన్నివేశాల్లో కూడా కనిపించలేదు నయనతార. దాంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. 

రజినీకాంత్ లాంటి హీరో సినిమాలో నటించడం అంటే ఖచ్చితంగా మంచి పాత్ర వుంటుంది అనుకున్న అభిమానులకు దర్బార్ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో కనీసం రజినీకాంత్ తో వచ్చే సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈమె కంటే రజనీ కూతురుగా నటించిన నివేద థామస్ ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకుంది. నయనతారను చాలా సన్నివేశాల్లో ఈమె డామినేట్ చేసింది. దాంతో హీరోయిన్ గా నటించిన నయనతార కంటే హీరో కూతురుగా నటించిన నివేదా థామస్ ఎక్కువగా లాభపడింది. ఏమైనా కూడా ఉన్న సైరా సినిమాలోనూ పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో నటించిన నయనతార.. ఇప్పుడు కూడా ఇదే చేసింది. 

More Related Stories