English   

తెలుగు ఇండస్ట్రీకి వస్తున్న మరో వారసురాలు..

 Arjun
2020-01-10 09:39:28

ఇప్పటికే తెలుగులో ఎంతోమంది వారసులు ఉన్నారు.. కానీ హీరోయిన్లు మాత్రం లేరు. వారసురాళ్లు వచ్చినా కూడా సక్సెస్ అయితే కాలేదు. ఇఫ్పుడు మరో వారసురాలు కూడా వస్తుంది. ఆమె మరెవరో కాదు యాక్ష‌న్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య. 38 ఏళ్లుగా ఈయ‌న ఇండ‌స్ట్రీలోనే ఉన్నాడు. 20 ఏళ్ల వ‌య‌సులోనే హీరోగా వ‌చ్చాడు ఇండ‌స్ట్రీకి. అప్ప‌ట్నుంచీ ఇక్క‌డ ప‌రిస్థితులు చూస్తున్నాడు. ఇక్క‌డ వాతావ‌ర‌ణం కూడా అర్జున్ కు కొత్త‌కాదు. ఈయ‌న కూతురు ఐశ్వ‌ర్య కూడా ఇప్పుడు ఇండ‌స్ట్రీలోనే ఉంది. హీరోయిన్ గా కూడా రెండు మూడు సినిమాలు చేసింది. 

అయితే తెలుగులో మాత్రం ఇప్పటి వరకు ఈమె అడుగు పెట్టలేదు. దాంతో టాలీవుడ్ ఎంట్రీ కోసం ఐశ్వర్య అర్జున్ సిద్ధమవుతుంది. 2013లో విశాల్ హీరోగా వచ్చిన 'పట్టాత్తు యానాయ్' సినిమాతో కోలీవుడ్ కు వచ్చింది ఈమె. ఆ తర్వాత 'ప్రేమ బరాహ' సినిమాతో కన్నడ ప్రేక్షకులనూ పలకరించింది. ఇప్పుడు తెలుగులో కూడా ఈమె అడుగు పెడుతుంది. ఈమె తొలి తెలుగు సినిమాను అర్జున్ డైరెక్ట్ చేయాలని చూస్తున్నాడు. ఓ పేరున్న నిర్మాణ సంస్థతో కలిసి అర్జున్‌ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించాలని అనుకుంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్లను తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ తీసుకున్నా కూడా మల్టీస్టారర్‌ సినిమాల్లోనో లేకపోతే సెకండ్ హీరోయిన్‌గానో తీసుకుంటున్నారు. అందుకే కూతురు కెరీర్ బాధ్యతలు అర్జున్ స్వయంగా తీసుకుంటున్నాడు.

More Related Stories