English   

సరిలేరు నీకెవ్వరు ప్రివ్యూ.. మహేష్ బాబు కొట్టేస్తాడా..

Sarileru Neekevvaru Pre review
2020-01-10 09:49:13

ఇంకా కొన్ని గంటలే.. మహేష్ బాబు ఫుల్ మాస్ అవతారంలోకి మారిపోవడానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న విడుదలవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 2000 థియేటర్స్ కు పైగా ఈ చిత్రం విడుదల కానుంది. దాదాపు 140 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సరిలేరు నీకెవ్వరు.

అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం కోసం అభిమానులు కూడా ఆసక్తిగానే వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ పాత్ర మహేష్ పాత్రకు ట్విస్ట్ ఇవ్వడమే కాకుండా మహేష్ పాత్రను ఎలివేట్ చేసే విధంగా ఉంటుందనీ.. ఎవరు ఊహించని విధంగా ఉండటంతో ధియేటర్ లో ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. 

అంతేకాదు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక విజయశాంతి మినహా మిగిలిన పాత్రలన్నీ అనిల్ రావిపూడి తనదైన శైలిలో కామెడీ చేయించాడని తెలుస్తోంది. ఆ కామెడీకి ప్రేక్షకులు విపరీతంగా నవ్వుకోవడం ఖాయం అని అంటున్నారు. ముఖ్యంగా సీరియస్ గా నటిస్తూ ఆ నటనలోనే కామెడీని పలికించే ప్రకాష్ రాజ్.. నట విశ్వరూపం ఈ సినిమాలో మరోసారి ప్రేక్షకులకు కనిపిస్తుందనీ హామీ ఇస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. 

మొన్న టీజర్ లో కూడా ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగు ఓ రేంజ్ లో హైలైట్ అయింది. ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడు వస్తున్నాడు అంటూ ఈయన చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇక ఈ సినిమాలో మరో హైలెట్ ఎపిసోడ్ కూడా ఉంటుందని అది దాదాపు 39 నిమిషాల పాటు సాగుతుందని తెలుస్తోంది. 

జబర్దస్త్ కామెడీ షో లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చమ్మక్ చంద్ర, అప్పారావు బ్యాచ్ మీద కలిసి అనిల్ రావిపూడి ఒక ట్రైన్ ఎపిసోడ్ రాశాడని.. దానికి రేపు థియేటర్ లో పడి పడి నవ్వుకోవడం ఖాయం అని తెలుస్తోంది. ఆల్ ఎపిసోడ్ లోనే రష్మిక ఫ్యామిలీ మహేష్ బాబును పడేయడానికి పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి అని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి భారీ అంచనాల మధ్య విడుదలవుతుంది ఈ చిత్రం.

More Related Stories