English   

పృథ్వీ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని

 Posani Krishna Murali
2020-01-10 13:01:54

అమరావతిని, అమరావతికి భూములు ఇచ్చిన రైతుల మీద వైసీపీ పార్టీ నేతలు నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.  అమరావతి రైతులని పైడ్ ఆర్టిస్ట్ లు అని, ఆడవాళ్ళని ముందు పెట్టి ఉద్యమాలు చేస్తున్నారని, ఆడీ కార్ రైతులు అని, వాళ్ళ చేతిలో ఫోన్ లు ఉన్నాయని, చేతికి వాచీలు ఉన్నాయని రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ అయితే, రైతులు బురదలో ఉండాలి దొరికేది తినాలి అంటూ, నాలుగు రోజులు క్రితం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

ఈ నేపధ్యంలోనే పృధ్వీ చేసిన వ్యాఖ్యలను మరో నటుడు పోసాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. అది కూడా హడావిడిగా రాత్రి 8 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. ఇంత హడావిడిగా రాత్రి పూట ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ప్రెస్ మీట్ మొదలు పెట్టటంతోనే, పృధ్వీ రైతులని ఇలా మాట్లాడటం చాలా తప్పని మొదలు పెట్టారు. రాజధాని రైతులు, మహిళల మీద పృథ్వీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కార్లు ఉండకూడదా? పొలం పనిచేసే మహిళలు బంగారు గాజులు కొనుక్కోకూడదా? అని నిలదీశారు.

‘రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నంతుకు పృథ్వీ సిగ్గు పడాలి. పృథ్వీకి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే రాజధానిలో మహిళలకు క్షమాపణ చెప్పాలి. నమో వేంకటేశాయ అనే పృథ్వీని అప్పుడే వెంకటేశ్వరస్వామి క్షమిస్తాడు.’ అని పోసాని అన్నారు. జగన్ ఎప్పుడూ రైతులను ప్రేమిస్తూనే ఉంటారని పోసాని స్పష్టం చేశారు. జగన్ సేవాభావంతో పనిచేస్తున్నా ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి మీలాంటి వారు పుట్టారు. మీ లాంటి వారి వల్ల జగన్ మోహన్ రెడ్డిని మహిళలు, సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారంటే అందుకు మీలాంటి వారే కారణమని ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. పృథ్వీ నీకు ఏమాత్రం ఎథిక్స్ ఉన్ననా  వారికి బేషరతుగా క్షమాపణ చెప్పమని డిమాండ్ చేశారు. 

More Related Stories