English   

ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు ఏమంత కష్టమొచ్చింది.. అలా మారిపోయిందేంటి..

 Rakul Preet singh
2020-01-10 13:33:30

రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్టుండి అంత సన్నగా ఎందుకు మారిపోయిందో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు లావుగా ఉందని కాదు కానీ మరీ ఇంత సన్నగా మాత్రం లేదు. మెరుపుతీగ చెల్లిలా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు. అసలే బరువు తక్కువగా ఉన్న రకుల్ ఇప్పుడు మరింత బరువు తగ్గిపోయి కనిపిస్తుంది. దీనికి కారణం బాలీవుడ్లో అవకాశాల కోసమే అని వార్తలు వినిపిస్తున్నాయి. 

అక్కడ ముద్దుగుమ్మలు మెరుపు తీగ‌లా ఉంటే తప్ప అవకాశాలు ఇవ్వరు. ఎవరో విద్యాబాలన్ లాంటి ఒకరిద్దరు హీరోయిన్లు మాత్రమే బొద్దుగా కనిపించి కూడా అవకాశాలు అందుకున్నారు. కానీ అది అందరి విషయంలో అది కుదరదు. మరీ ముఖ్యంగా సౌత్ నుంచి వచ్చిన హీరోయిన్లను బాలీవుడ్ దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోరు.

కాజల్, అసిన్ లాంటి హీరోయిన్లు అక్కడ హిట్లు కొట్టిన తర్వాత కూడా అవకాశాల కోసం వేచి చూశారు. వాళ్లకు తోడు ఇలియానా, తమన్నా ఇలియానా లాంటి చాలామంది హీరోయిన్లు అక్కడ నటించలేక మళ్లీ వెనక్కి వచ్చేశారు. తనకు ఆ పరిస్థితి రాకూడదని ముందు నుంచి జాగ్రత్త పడుతుంది రకుల్ ప్రీత్ సింగ్.

సౌత్ లో స్టార్ హీరోయిన్ అయినా బాలీవుడ్ లో మాత్రం ఇప్పటివరకు గుర్తింపు తెచ్చుకోలేకపోయింది రకుల్. ప్రస్తుతం అక్కడ అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న సినిమాలో రకుల్ కూడా ఉంది. ఈ సినిమాతో అక్కడ మళ్లీ తనకు మంచి రోజులు వస్తాయని న‌మ్ముతుంది ర‌కుల్. అందుకే బరువు పూర్తిగా తగ్గిపోయి జీరో సైజ్ లోకి వచ్చేసింది ఈ భామ‌.

More Related Stories