చిరంజీవితో మళ్లీ పూరీ జగన్నాథ్.. ఈసారి పక్కానా..

చిరంజీవి వరస సినిమాలు చేయడం అభిమానులతో పాటు దర్శకులకు కూడా ఆనందాన్నిస్తుంది. మంచి కథ తీసుకెళ్తే కచ్చితంగా ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు మెగాస్టార్ కూడా కుర్ర దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇదే క్రమంలో అనిల్ రావిపూడి లాంటి దర్శకులు కూడా చిరు కోసం వేచి చూస్తున్నారు.
ఆయన సినిమాలు మానేసిన తర్వాత ఈ తరం దర్శకులకు అతడితో సినిమా చేసే అవకాశం ఇక రాదేమో అని అంతా నిరాశపడ్డారు. కానీ మెగాస్టార్ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు అంతా పండగ మూడ్ లో ఉన్నారు. ఆయన కోసం కథలు సిద్ధం చేసి మెప్పించాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే చాలా ఏళ్ల నుంచి పూరీ జగన్నాథ్ ఇలాంటి ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈయన 150వ సినిమాను పూరీనే తెరకెక్కించాల్సి ఉంది. దీనికి ఆటోజానీ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాడు పూరీ. అంతా ఓకే అనుకున్న తరుణంలో సినిమా ఆగిపోయింది.
అయితే చిరంజీవితో సినిమా ఆగిపోవడం ఇదే తొలిసారి కాదు.. మూడో సారి అంటున్నాడు పూరీ. ఆటోజానీకి ముందు కూడా మూడుసార్లు కథ చెప్పినా ఫలితం లేకుండా పోయిందంటున్నాడు ఈయన. నా బ్యాడ్ లక్ ప్రతీసారి అన్నయ్యకు నచ్చే కథ చెప్పలేకపోతున్నాను అంటున్నాడు పూరీ జగన్నాథ్. అందులో రెండుసార్లు దురదృష్టవశాత్తు రెండు సార్లు పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయిన తర్వాత ఆగిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం చిరు ఓకే అంటే కేవలం ఐదంటే ఐదే రోజుల్లో కథ సిద్ధం చేసి ఆయనకు వినిపిస్తానంటున్నాడు పూరీ జగన్నాథ్.
ఇస్మార్ట్ శంకర్ విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ఈయన ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈసారి మాత్రం చిరంజీవితో పని చేసే ఛాన్స్ వస్తే వదులుకునే సమస్యే లేదంటున్నాడు ఈయన. దానికి తగ్గట్లే తన కోసం కథ సిద్ధం చేసుకోవాల్సిందిగా పూరీని చిరు కోరినట్లు తెలుస్తుంది. మరి చూడాలి.. చిరు ఈయనను నమ్మి సినిమా ఇస్తాడో లేదో..?