అలాంటి కధ దొరికితేనే హీరోగా

సినిమా పరిశ్రమలోకి నటులుగా ప్రవేశించి సంగీత దర్శకులుగా స్థిరపడిన వారిని అలాగే సంగీత దర్శకులుగా వచ్చి హీరోలుగా మారిన వాళ్ళూ ఉన్నారు. నటుడిగా వచ్చిన తమన్ (బాయ్స్) ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలిస్తే మ్యూజిక్ డైరెక్టర్స్ గా మంచి ఫాంలో ఉండి ఆ తరువాత హీరోలుగా మారారు విజయ్ ఆంటోని, జీవి ప్రకాష్ లు. అయితే చాన్నాళ్ళ నుండి దేవి శ్రీ ప్రసాద్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతోంది. అది కూడా అల్లా టప్పాగా కాదని స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఆయన్ని లాంచ్ చేస్తాడని ఆ ప్రచారం సాగింది. ఆ మద్య ఆయన పెద్దగా సినిమాలు ఒప్పుకోక పోవడంతో నిజమే అని జనాలు కూడా నమ్మారు. అయితే తనకు కూడా కథానాయకుడిగా చేయాలని ఉన్నట్లు పలు సందర్భాల్లో దేవి కూడా మనసులో మాట బయటపెట్టారు. ఈ విషయం గురించి దేవిశ్రీ ప్రసాద్ ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్ లో మళ్ళీ బయట పడ్డాడు. తనను హీరోగా చేయమని అడుగుతున్నారు. కానీ, సంగీతంపై ఉన్న ఆసక్తి వల్ల నటనపైకి దృష్టి వెళ్లడం లేదని చెప్పుకొచ్చాడు. అంతేకాక ఆయనకు వచ్చే కధలు తెలుగు కంటే తమిళంలోనే వస్తున్నాయట. ఒకవేళ భవిష్యత్తులో సంగీత సంబందిత కథ ఏమైనా ఉంటే హీరోగా చేస్తానని చెప్పుకొచ్చారు.