English   

మహాసముద్రంలోకి జాను కపుల్ ...చైతూ పరిస్థితి ఏంటో

jaanu
2020-01-10 19:31:09

 ‘ఆర్‌ఎక్స్‌ 100’ వంటి హిట్‌తో తెలుగు చిత్రసీమ దృష్టిని ఆకర్షించిన  యువ దర్శకుడు అజయ్‌ భూపతి. తన తర్వాతి చిత్రాన్ని పట్టాలెక్కించడానికి మాత్రం ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ఆయన ‘మహా సముద్రం’ పేరుతో ఓ క్రేజీ మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరిగింది. ఈ కథ అనేక మంది హీరోల చుట్టూ తిరగ్గా చివరికి రవితేజ దగ్గరికి వెళ్ళింది. ఆయన ముందు ఒప్పుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. దీంతో ఇదే కథను విశ్వక్‌ సేన్‌ - కార్తికేయలతో కలిసి చేస్తున్నాడని కూడా న్యూస్ వచ్చింది.  నిజానికి మహా సముద్రం కథ తొలుత నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్నారట. అయితే అప్పట్లో మజిలీ చిత్రంతోనూ, అలాగే తదుపరి ప్రాజెక్టులతో నాగచైతన్య బిజీగా ఉండటంతో అజయ్‌ భూపతి వెంటనే రవితేజను కలిశారట.

రవితేజ హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు మళ్ళీ నాగచైతన్య దగ్గరకే మహాసముద్రం ప్రాజెక్టు వెళ్లిందని ప్రచారం జరిగింది. అయితే అదేం అయిందో తెలీదు కానీ తాజాగా శర్వానంద్‌ ఈ సినిమాలో నటిస్తున్నాడని ప్రచారం మొదలయింది. ఇప్పటికే ఈ విషయంపై ఇద్దరి మధ్య చర్చలు సాగాయని, దాదాపు ఖరారయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అంతేకాదు ఈ చిత్రంలోనే శర్వానంద్‌ సరసన సమంత నటించనుందని అంటున్నారు. ఇప్పటికే ‘జాను’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. మళ్ళీ ఈ సినిమాలో కూడా వీరి కలిసి నటించావచ్చని అంటున్నారు. అయితే ఇందులో నాగచైతన్య కూడా ఉన్నాడా ? లేక అయన ప్లేస్ లో శర్వాని తీసుకుంటున్నారా ? అనేది చూడాలి.

More Related Stories