English   

మహేష్ బాబు చిరకాల కోరిక అనిల్ రావిపూడి తీరుస్తాడా..

mb
2020-01-10 20:02:05

తెలుగులో మహేష్ బాబుకు తిరుగులేని ఇమేజ్ ఉంది. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భీభత్సంగా ఉంది. ఇండస్ట్రీ రికార్డులు కూడా తిరగరాసిన సత్తా మహేష్ బాబు సొంతం. అయితే ఎంత ఉన్నా కూడా ఒక్క విషయంలో మాత్రం మిగిలిన హీరోలతో పోలిస్తే మహేష్ బాబు కాస్త వెనకే ఉన్నాడు. అదే మాస్ ఫాలోయింగ్.. ఈయనకు క్లాస్ లో తిరుగులేని క్రేజ్ ఉంది కానీ మాస్ పరంగా మాత్రం చాలా వీక్. అందుకే మహేష్ బాబు సినిమాలు మిగిలిన వాళ్లతో పోలిస్తే కాస్త తక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అతడు, పోకిరి, దూకుడు లాంటి సినిమాలు సమయానుసారంగా వచ్చి సంచలనాలు రేపాయేమో కానీ మరీ మాస్ లో మాత్రం చొక్కాలు చించుకునే ఫాలోయింగ్ మాత్రం తీసుకురాలేదు. చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వాళ్లకు ఇప్పటికే మాస్ ఇమేజ్ దిమ్మతిరిగేలా ఉంది. ఈ విషయంలో మహేష్ వీక్. ఈయనకు లేడీస్ ఫాలోయింగ్ ఉంటుంది.. అలాగే క్లాస్ ఇమేజ్ ఉంటుంది కానీ చొక్కాలు చింపుకునే అభిమానులు మాత్రం లేరు. డీసెంట్ బ్యాకింగ్ ఉంటుంది ఎప్పుడూ మహేష్ బాబుకు. కానీ తనకు మిగిలిన వాళ్లలా ఉండాలని ఫిక్సైపోయాడు. అందుకే మాస్ ఇమేజ్ కోసం మిషన్ మొదలుపెట్టాడు ఈ హీరో. తనకు కూడా ఈ ఇమేజ్ కావాలంటున్నాడు సూపర్ స్టార్. అందుకే సోషల్ మెసేజ్ లు పక్కనబెట్టి పక్కా కమర్షియల్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు ఈయన.

ఇఫ్పుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు కూడా ఇదే. ఈ సినిమా పక్కా ఫక్తు కమర్షియల్ సినిమా. అందులో ఎలాంటి అనుమానాలు లేవు.. నూటికి నూరు శాతం మాస్ సినిమా. ఇప్పుడు ఓపెనింగ్స్ కూడా బ్రహ్మాండంగా వస్తాయని ఫిక్సైపోయాడు మహేష్. గతంతో పోలిస్తే ఈ చిత్రంపై మహేష్ బాబు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో కచ్చితంగా 100 కోట్ల మార్క్ అందుకుంటానని చెబుతున్నాడు. ఇదే జరిగితే మాస్ లో మహేష్ ఇమేజ్ మరింత పెరగడం ఖాయం. చాలా ఏళ్లుగా మహేష్ వేచి చూస్తున్న క్రేజ్ ఇది. దీని తర్వాత వంశీ పైడిపల్లితో కూడా పక్కా మాస్ సినిమానే చేయబోతున్నాడు సూపర్ స్టార్. మొత్తానికి ట్రాక్ మార్చి మాస్ ఇమేజ్ కోసం మ్యాగ్జిమమ్ ట్రై చేస్తున్నాడు సూపర్ స్టార్. సరిలేరు హిట్ అయితే మహేష్ కోరుకున్న ఇమేజ్ వచ్చేసినట్లే.. ఇక ఆ తర్వాత వంశీ సినిమాతో అంతా సెట్ అయిపోతుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?

More Related Stories