English   

సరిలేరు నీకెవ్వరు రివ్యూ వచ్చేసింది.. బొమ్మకు తిరుగులేదంట..

sari
2020-01-10 20:19:03

బయటి నుంచి రివ్యూలు రాకుండా ఎంతగా అడ్డుపడుతున్నా కూడా రాకుండా మాత్రం ఉండటం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు ముంబై ట్రేడ్ అనలిస్ట్ శివ సత్యం రివ్యూ ఇచ్చేసాడు. జనవరి 11న సినిమా విడుదలవుతుంటే.. 10వ తేదీ సాయంత్రమే తన ట్విట్టర్ లో రివ్యూ పోస్ట్ చేసాడు. ఈయన సినిమా అదిరిపోయింది అంటూ రివ్యూ పెట్టాడు. సినిమా కంప్లీట్ విజువల్ ప్యాకేజ్ అని.. కమర్షియల్ సినిమా అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా మహేష్ బాబు నటన చాలా బాగుందంటూ ట్వీట్ చేసాడు ఈయన. గతంలో సైరా, సాహో సినిమాలకు కూడా ముందుగానే రేటింగ్ ఇచ్చాడు శివ సత్యం. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుకు కూడా ఇదే చేసాడు ఈయన. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కు 4.. యాక్షన్‌ సీక్వెన్సులకు 4.. అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభకు 4.. సహాయ నటులకు 4... ఎడిటింగ్‌కు 3.. స్క్రీన్ ప్లేకు 4.. సినిమాటోగ్రఫీకి 4.. నేపథ్య సంగీతానికి 3.5.. కథకు 4.. హీరోయిన్ రష్మికకు 3.. ప్రకాష్ రాజ్‌కు 3 చొప్పున రేటింగ్ ఇచ్చాడు. విడుదలకు ముందే ఇలా రేటింగ్ పెట్టడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. అయితే కొందరు మాత్రం శివ సత్యంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క షో కూడా పడలేదు మీరు సినిమా ఎక్కడ చూసారంటూ అడుగుతున్నారు. ఏదేమైనా కూడా పాజిటివ్ రివ్యూ బయటికి రావడంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు స్పెషల్ షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో అర్ధరాత్రి నుంచే థియేటర్ల దగ్గర సందడి షురూ కానుంది. ఇక యూఎస్‌లో ప్రీమియర్ షోలు కూడా పడతాయి కాబట్టి తెల్లారేసరికల్లా టాక్ తెలుస్తుంది. హైదరాబాద్‌లో కూడా ఉదయం 7 గంటలకు ఫస్ట్ ఫో పడిపోతుంది. ఎటు చూసుకున్నా కూడా టాక్ బయటికి రావడానికి పెద్దగా సమయం అయితే పట్టదు.

More Related Stories