English   

సరిలేరు నీకెవ్వరు ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ దద్ధరిల్లిపోయింది

Sarileru Nekevvaru Review.jpg
2020-01-11 06:11:52

సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ముందు నుంచి ఉన్న అంచనాలు నిలబెడుతూ ఈ చిత్రాన్ని ఫుల్ టైమ్ సంక్రాంతి సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులకు అయితే సరిలేరు నీకెవ్వరు ఫెస్టివల్ బొనాంజా. చాలా రోజుల తర్వాత ఆయనలోని మరో నటుడు పైకి లేచాడు. కాస్త ఎమోషనల్ సినిమాలు చేస్తూ వస్తున్న ఆయనకు సరదా సినిమా పడి చాలా ఏళ్ళైపోయింది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ఈ లోటు భర్తీ చేసేలా కనిపిస్తుంది.

ఆరు షోలకు అనుమతి ఉండటంతో మధ్యరాత్రి ఒంటిగంట నుంచి థియేటర్ల దగ్గర మహేష్ బాబు అభిమానుల సందడి కనిపించింది. చాలా చోట్లా రాత్రికే షోస్ పడిపోయాయి. ఇక హైదరాబాద్ లో కూడా ఉదయం నుంచే సందడి మొదలైంది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం.. మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ కు పండగే అని తేలడంలో మహేష్ అభిమానులు నిజంగానే గాల్లో తేలిపోతున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కాశ్మీర్ యాక్షన్ సీన్స్ తో పాటు ట్రైన్ కామెడీ సీక్వెన్స్ సినిమాకు బలం.

ఇక అప్పటి వరకు ఉన్న సినిమా స్థాయిని మార్చేస్తూ వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మరో హైలైట్. సెకండ్ హాఫ్ విజయశాంతి రావడంతో మరో స్థాయికి వెళ్లిపోయింది సినిమా. రొటీన్ కథ అయినా కూడా పర్ ఫెక్ట్ గా కమర్షియల్ అంశాలన్నీ జోడించి సరిలేరు నీకెవ్వరూ అనిపించాడు అనిల్ రావిపూడి.

ఈ సినిమాతో ముందు నుంచి చెబుతున్నట్లు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడానికి మహేష్ బాబు అన్నీ సిద్ధం చేసుకున్నారు. కెరీర్లో తొలిసారి మహేష్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేసినా కూడా ఎక్కడా బెరుకు లేకుండా పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కించి తనకు తిరుగులేదని నిరూపించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ట్విట్టర్ రివ్యూస్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి.. దాంతో విడుదలైన తర్వాత కూడా సినిమా దున్నేయడం ఖాయంగా కనిపిస్తుంది.

More Related Stories