English   

ఇండస్ట్రీలో నన్ను తొక్కేసారంటున్న కమెడియన్..

siva
2020-01-11 07:08:13

టాలీవుడ్ లో మల్టీ టాలెంట్ చూపించి చాలా తక్కువ సమయంలోనే మంచి నటుడిగా ఎదిగాడు శివా రెడ్డి. కమెడియన్ గా వచ్చినా కూడా ఆ తర్వాత చాలా వరకు మంచి పాత్రలు చేసాడు. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోల సినిమాల్లో కూడా కనిపించాడు. కానీ దూకుడు తర్వాత ఈయన పూర్తిగా స్క్రీన్ కు దూరమయ్యాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నా కూడా అవార్డు వేడుకల్లో కూడా కనిపించడం మానేసాడు. తన కెరీర్ నాశనం కావడానికి కారణం తెలుగు ఇండస్ట్రీలో కొందరు అంటున్నాడు ఈయన. తను కావాలని ఇండస్ట్రీకి దూరం కాలేదని.. అవకాశాలు రాక దూరమయ్యానని చెబుతున్నారు. తనను కావాలనే దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదని చెబుతున్నాడు ఈయన. తాను చాలా మందికి సాయం చేసానని.. కానీ తనను ఎందుకు ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదో అనేది అర్థం కావడం లేదని చెబుతున్నాడు శివా రెడ్డి.

దాసరి నారాయణరావు, చిరంజీవి లాంటి పెద్దలు తన టాలెంట్ గుర్తించి గొప్పగా మాట్లాడారని.. కానీ ఇప్పుడు ఎవరూ ఒక్క అవకాశం కూడా ఇవ్వడం లేదని చెబుతున్నాడు ఈయన. ఇండస్ట్రీలో ఉన్నంత కాలం చాలా ఎంజాయ్ చేశానని.. కానీ ఇప్పుడు తను ఖాళీగానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు శివా రెడ్డి. ఏం చేస్తాం కళామతల్లి ఒడిలో తనకు అంతే రాసి పెట్టి ఉందని చెప్పుకొచ్చాడు ఈయన. ఇప్పటికి కూడా తనకు ఆఫర్స్ ఇస్తే కష్టపడి పని చేస్తానని చెప్తున్నాడు కానీ ఇచ్చేవాళ్లు అయితే ఉండాలి కదా. ఇండస్ట్రీలో తనను కావాలనే తొక్కేశారని క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇప్పటి వరకు తనను తొక్కేసిన వ్యక్తి పేరు బయటపెట్టలేదని.. తనకు అవకాశాలు రానప్పుడు కూడా ఆ వ్యక్తి పేరు చెప్పలేదని తెలిపారు. కనీసం అది తెలుసుకుని ఉంటే బాగుండేదని.. కానీ ఇక్కడ రాజకీయాలు అంతే అంటున్నాడు శివా రెడ్డి. తెలంగాణ వాడు కావడం కూడా ఈయన కెరీర్ కు శాపంగా మారిందనే వాళ్లు కూడా లేకపోలేదు ఇండస్ట్రీలో.

More Related Stories