English   

సరికొత్త రికార్డ్స్ సృష్టించిన సరిలేరు నీకెవ్వరు...

sari
2020-01-11 07:25:46

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, లీడింగ్ యాక్ట్రెస్ రష్మిక జంటగా రూపొందిన “సరిలేరు నీకెవ్వరు”. ఈ సినిమా పెద్ద ఎత్తున జనవరి 11 వ తేదీ అంటే ఈరోజు రిలీజ్ అవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబు కెరీర్ లోనే మొదటి సారిగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా దేశమంతా అత్యధిక లొకేషన్స్ లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం సినిమా బజ్ కూడా బాగుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం కేరళలో  సరిలేరు నీకెవ్వరు సినిమా 30కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ కాబోతోంది. అది కూడా తెలుగులో, ఈ సినిమాని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శించబోతున్నట్లు చెబుతున్నారు. గతంలో ఏ తెలుగు సినిమా కూడా తెలుగులో ఈ స్థాయిలో రిలీజ్ కాలేదు. ఆ రేంజ్ లో సినిమా రిలీజ్ చేసిన రికార్డ్ ని మహేష్ అందుకోబోతున్నాడు. శనివారం ఉదయం 6గంటల నుంచే అక్కడ షోలు మొదలుకానున్నాయి. ఇక రేపు ఈ మూవీ కొచ్చి లో ఉదయం 6:30 షో తో మొదలు కానుంది. కేరళ లో ఉదయం 6:30 షో తో ప్రదర్శించబడుతున్న మొదటి తెలుగు మూవీ గా కూడా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వలే మహేష్ బాబు కూడా కేరళలో పాపులారిటీ పెంచుకొనడం విశేషం.

More Related Stories