English   

ఆర్ఆర్ఆర్ షూటింగ్....తాజా అప్డేట్ ఇదీ

rrr
2020-01-11 08:53:34

బాహుబలి సినిమా తర్వాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. కిందటే డాది నవంబర్‌లో షూటింగ్ మొదలయిన ప్రారంభమైన ఈ సినిమా మొన్న నవంబర్ నాలకి సంవత్సరం పూర్తి చేసుకుంది. అయితే, ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్స్ కోసం ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా గురించి ప్రతి చిన్న విషయం కూడా పెద్ద న్యూస్ అవుతోంది. ఇక ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అప్డేట్ బయటకి వచ్చింది. తాజా ప్రచారం క‌థ‌నాల ప్ర‌కారం ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ స‌మీపంలోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో జ‌రుగుతోందని చెబుతున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ నైట్ ఎఫెక్ట్ షెడ్యూల్ లో చ‌ర‌ణ్ బృందంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అయితే మరో విషయం ఏంటంటే ఈ షెడ్యూల్ మొత్తం చరణ్ మీదనే అట. ఈ షెడ్యూల్ లో తార‌క్ లేడట. ఇక ఈ ఫిబ్రవరి నెలాఖ‌రుక‌ల్లా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తిచేసి ఆపై వీలయినంత త్వరగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చేసి చెప్పిన సమయానికే రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని అంటునారు. జక్కన్న ప్రకటన ప్రకారం ఈ సినిమా జూలై 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

 

More Related Stories