English   

అల వైకుంఠపురంలో ప్రీమియర్ షో టాక్..

alaft
2020-01-12 08:07:40

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురంలో. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. ఓవర్సీస్ టాక్ ప్రకారం చూస్తుంటే ఈ సంక్రాంతికి పెద్ద విజయం అందుకునేలా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు అల వైకుంఠపురంలో సినిమా అద్భుతంగా కనెక్ట్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఓవర్సీస్ నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు కూడా ఆనందంలో తేలిపోతున్నారు. ఏడాదిన్నర గ్యాప్ తర్వాత వచ్చాడు బన్నీ. వచ్చీరాగానే బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసి అద్భుతమైన ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలో రాసుకున్నాడు. ఫస్టాఫ్ అంతా కామెడీతో నడిపించిన కీలకమైన సెకండాఫ్ లో మాత్రం మనసును తాకే చాలా సన్నివేశాలు ఉన్నాయని.. ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ తో మరోసారి అత్తారింటికి దారేది స్థాయి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చాడని సంబరపడిపోతున్నారు గురూజీ అభిమానులు. ఎటు చూసుకున్న కూడా అల్లు అర్జున్ బ్లాక్బస్టర్ కొట్టడం ఖాయం అయిపోయింది. ఈ సినిమా ఖచ్చితంగా ఓవర్సీస్ తోపాటు ఇండియాలో కూడా భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చి సంక్రాంతికి సందడి చేయడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఇది ఏ స్థాయి విజయం అనేది మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది.

More Related Stories